Nellore: ఎన్టీఆర్ భవన్‌లో దద్దరిల్లిన బాలయ్య బర్త్‌డే వేడుకలు: ముఖ్య అతిథులుగా హాజరైన ఎమ్మెల్యేలు సోమిరెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి!

Nellore: నెల్లూరు ఎన్టీఆర్ భవన్‌లో నుడా (NUDA) చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి ఆధ్వర్యంలో నందమూరి బాలకృష్ణ జన్మదిన వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి.

Arun Chilukuri
Published on: 11 Jun 2026 7:06 AM IST
Nellore
X

Nellore: ఎన్టీఆర్ భవన్‌లో దద్దరిల్లిన బాలయ్య బర్త్‌డే వేడుకలు: ముఖ్య అతిథులుగా హాజరైన ఎమ్మెల్యేలు సోమిరెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి!

నెల్లూరు: NTR భవన్ లో కోటంరెడ్డి ఆధ్వర్యంలో జరిగిన బాలకృష్ణ జన్మదిన వేడుకలు పండుగ వాతావరణాన్ని తలపించాయి.. ముఖ్య అతిధులుగా ఎమ్మెల్యేలు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి , వక్ఫ్ బోర్డు చైర్మన్ అజీజ్, చేజర్ల వెంకటేశ్వర్లు రెడ్డి లు హాజరయ్యారు. భారీగా వచ్చిన బాలకృష్ణ అభిమానులు, టీడీపీ నేతలతో NTR భవన్ కిక్కిరిసిపోయింది. పలు చోట్ల అన్నదాన కార్యక్రమాలతో పాటు సేవా కార్యక్రమాలు అభిమానులు పెద్ద ఎత్తున నిర్వహించారు.

నందమూరి బాలకృష్ణ అభిమానాన్ని, నమ్మకాన్ని పొందటం తన అదృష్టమని నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి అన్నారు.. ఆయన వల్లే తాను ఈ స్థాయిలో ఉన్నానని వెల్లడించారు. నందమూరి బాలకృష్ణ పుట్టిన రోజు వేడుకలతో NTR భవన్ దద్దరిల్లింది. పెద్ద ఎత్తున బాణాసంచా కాల్చారు.. పలుచోట సేవా కార్యక్రమాలతో పాటు అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు..బాలకృష్ణ అభిమానులు, టీడీపీ నేతలతో NTR భవన్ కిక్కిరిసింది.. ఈ సందర్భంగా కోటంరెడ్డి మాట్లాడారు..

ఒకప్పడు బాలకృష్ణ తో ఫోటో తీసుకోవాలవాలనే ఆశ ఉండేదనీ.. దేవుడు దయ వల్ల ఇప్పుడు ఆయన కుటుంబ సభ్యుడిగా మారిపోయానని వెల్లడించారు. ఆయన చేతులు మీదుగా తన కొడుకు పెళ్లి జరిగిందని గుర్తు చేసుకున్నారు.

బాలకృష్ణ మనస్తత్వం ఎవ్వరికీ ఉండదని.. నమ్ముకున్న వారికోసం ఎంత దూరమైనా వెళ్ళే నైజం ఆయనకే సొంతం అన్నారు.. తాను కూడా ఆయన బాటలో ప్రయాణం సాగిస్తున్నట్లు వివరించారు. గొంతులో ప్రాణం ఉన్నంత వరకు నమ్ముకున్న వారికి అండగా ఉంటానన్నారు. ఇక్కడ నుంచి రాజకీయాలు చేస్తాననీ.. పార్టీ కోసం చివరి శ్వాస వరకు పోరాటం చేస్తుంటా అని వెల్లడించారు.. వైసీపీ హయంలో నన్ను చంపాలని చూశారనీ.. తన కొడుకే బతికించాడని అన్నారు. శ్రమ, కష్టపడే తత్వం ఉన్నప్పటికీ.. విధి రాత సరిగా లేకపోవడంతోనే ఎమ్మెల్యే అవ్వలేక పోయానని తన మనసులోని భావాలను అందరితో పంచుకున్నారు.

టీడీపీకి రాబోయే జనరేషన్ స్ట్రాంగ్ గా ఉందని.. కోటంరెడ్డి కుమారుడు ప్రజయ్ సేనా రెడ్డి చాలా చక్కగా మాట్లాడుతున్నారని సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు.. బసవ తారకం ద్వారా ఎంతో మందికి పునర్ జన్మ ప్రసాదించిన గొప్ప వ్యక్తి బాలకృష్ణ అని ఆయన కొనియాడారు.

ఇప్పుడు ఉన్న చాలా మంది ఎమ్మెల్యేలు మంత్రులు గతంలో కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి అనుచరులే అని రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు. విద్యార్ధి రాజకీయాలలో ఆయన ఎంతోమందికి రాజకీయ పాఠాలు నేర్పారని గుర్తు చేశారు. తన లాగే కోటంరెడ్డి ఇప్పటికే రెండు, మూడు సార్లు ఎమ్మెల్యే అవ్వాల్సిందని.. దురదృష్టం అది జరగలేదన్నారు.. వచ్చే ఎన్నికల్లో కోటంరెడ్డి కచ్చితంగా ఎమ్మెల్యేగా గెలుస్తారని ధీమా వ్యక్తం చేశారు.

ఎన్ని కష్టలొచ్చినా.. పదవి ఉన్నా లేకున్నా ఎప్పుడూ బాలకృష్ణకు అభిమానిగా ఉన్న నాయకులు కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి అని వక్ఫ్ బోర్డ్ చైర్మన్ అబ్దుల్ అజీజ్ అన్నారు.. గొప్ప నటులుగా మాత్రమే కాకుండా.. క్యాన్సర్ బారిన పడిన వారిని కాపాడే గొప్ప మనసున్న వ్యక్తి బాలకృష్ణ అని ఆయన కొనియాడారు.. లక్షల కుటుంబాలలో వెలుగులు నింపి తండ్రికి తగ్గ తనయుడిగా బాలయ్య పేరు గడించారని అన్నారు. రాష్ట్రంలో ఉండే ప్రతి యువతకు బాలకృష్ణ ముద్దుల మావయ్య అని వెల్లడించారు.. వైసీపీ హయంలో పార్టీ కోసం కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి అనేక పోరాటాలు చేశారని గుర్తు చేశారు.

సినీ, రాజకీయ రంగంలో బాలకృష్ణ తనకంటూ ప్రత్యేక ముద్ర వేసుకున్నారని జిల్లా ప్రధాన కార్యదర్శి చేజర్ల వెంకటేశ్వర్లు రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో సిటీ నియోజకవర్గ టీడీపీ నేతలు, బాలకృష్ణ అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story