Nellore: నందవరంలో వైభవంగా 226వ గంధ మహోత్సవం

Nellore: నెల్లూరు జిల్లా నందవరం గ్రామంలో శ్రీ హజరత్ సయ్యద్ షాబ్దారసూల్, శ్రీ హజరత్ సయ్యద్ గులామ్ అలీషా ఔలియా వారి 226వ గంధ మహోత్సవం అత్యంత వైభవంగా జరిగింది.

TS Murthy, Atmakuru(Nellore)
Published on: 2 July 2026 7:21 AM IST
Nellore
X

Nellore: నందవరంలో వైభవంగా 226వ గంధ మహోత్సవం

Nellore: నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం నందవరం గ్రామంలో వెలసి ఉన్న శ్రీ హజరత్ సయ్యద్ షాబ్దారసూల్, శ్రీ హజరత్ సయ్యద్ గులామ్ అలీషా.ఆహలె తబ్ ఖాతుల్ ఖాదరి. ఔలియా వారి 226వ గంధ మహోత్సవం ఘనంగా జరిగింది. బుధవారం రాత్రి ఆస్తాన- ఏ - షాబ్దారసూల్, పీర్ల చావిడి నుండి గలేఫ్ పూల చాందిని, ఫకీరుల జరుబులు జల్సాల నడుమ దర్గా వద్దకు చేరుకొని దర్గా సమాధులపై పూల దుప్పట్లు గలేఫ్ వస్త్రాలు సుగంధదవ్యాలు సమాధులపై సమర్పించి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి గంధ ప్రసాదాన్ని భక్తులకు పంపిణీ చేశారు.

అనంతరం దర్గా ఆధ్వర్యంలో భారీ అన్నదాన కార్యక్రమం దర్గా కమిటీ సభ్యులు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా అనంతసాగరం ఆస్తాన-ఏ- యూసుఫియా. ఆస్తాన-ఏ- మషుకూరియా . పిఠాధిపతులు హజరత్ సయ్యద్ మునీర్ అలీషా ఖాదరి. హజరత్ సయ్యద్ నజీర్ అలీషా ఖాదరి.

హజరత్ సయ్యద్ సాని యూసుఫ్ అలీషా, ఖాదరి (బాషా సాహెబ్ )హజరత్ సయ్యద్ సర్ వర్ అలీషా.ఖాదరి(బాబుని)నెల్లూరు ఆస్థాన- ఏ- మునీమ్ పీఠాధిపతులు. హజరత్ సయ్యద్ ముబఫీరుల్లా హుస్సేని. హజరత్ సయ్యద్ సర్ వర్ అలీషా. బాబుని. మరియు సయ్యద్ ఖైరుల్లాషా. సయ్యద్ సాని అలీముల్లాషా.సయ్యద్ సాని తురాబ్ అలీషా. వివిధ ప్రాంతాల గురువర్యులు పాల్గొని. దర్గాలో ప్రత్యేక ప్రార్థన నిర్వహించారు.

TS Murthy, Atmakuru(Nellore)

TS Murthy, Atmakuru(Nellore)

Next Story