Nellore: "నారాయణ ఆన్ వీల్స్" ద్వారా విద్యార్థులకు ఉచిత వైద్య పరీక్షలు
Nellore: మంత్రి నారాయణ సొంత నిధులతో నెల్లూరులో నిర్వహిస్తున్న "నారాయణ ఆన్ వీల్స్" సేవల్లో భాగంగా ఆకుతోటపల్లి RSR మున్సిపల్ హైస్కూల్ విద్యార్థులకు ఉచిత కంటి, దంత వైద్య శిబిరం నిర్వహణ.
Nellore: "నారాయణ ఆన్ వీల్స్" ద్వారా విద్యార్థులకు ఉచిత వైద్య పరీక్షలు
నెల్లూరు: నెల్లూరు ప్రజల ఆరోగ్యమే ధ్యేయంగా మంత్రి నారాయణ సొంత నిధులతో నిర్వహిస్తున్న నారాయణ ఆన్ వీల్స్ వైద్య సేవా యజ్ఞం దిగ్విజయంగా కొనసాగుతోంది. సామాన్యుల ఇంటి ముంగిటకే కార్పొరేట్ స్థాయి6 వైద్యాన్ని చేరువ చేయడమే కాకుండా, శనివారం పూట పాఠశాల విద్యార్థులకు ప్రత్యేక పరీక్షలు నిర్వహిస్తూ వారి భవిష్యత్తుకు కొండంత అండగా నిలుస్తున్నారు. మంత్రి నారాయణ ఆధ్వర్యంలో సుమారు 3 కోట్ల వ్యయంతో అందుబాటులోకి వచ్చిన నారాయణ ఆన్ వీల్స్ మొబైల్ క్లినిక్ ద్వారా నిరుపేదలకు ఉచిత వైద్య సేవలు నిరంతరాయంగా అందుతున్నాయి.
వారంలో 2 రోజులు సిటీ, 2 రోజులు రూరల్ ప్రాంతాల్లో ఉచిత వైద్య శిబిరాలు నిర్వహిస్తుండగా...నారాయణ నేత్ర జ్యోతి ద్వారా ఇప్పటివరకు 11,800 మందికి కంటి పరీక్షలు చేసి, 6,900మందికి ఉచితంగా కంటి అద్దాలు పంపిణీ చేశారు. చూపు కోల్పోయే ప్రమాదంలో ఉన్న 175 మందికి నారాయణ ఆసుపత్రిలో ఉచితంగా శస్త్రచికిత్సలు నిర్వహించి తిరిగి దృష్టిని ప్రసాదించడమే కాకుండా, నారాయణ దంత సురక్ష ద్వారా 7800 మందికి ఉచితంగా దంత వైద్య సేవలు అందించారు.
ఈ సేవా6 యజ్ఞంలో భాగంగా శనివారం 8వ డివిజన్, స్టోన్ హౌస్ పేట RSR మున్సిపల్ హైస్కూల్‌లో విద్యార్థులకు ప్రత్యేక ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని మాజీ మున్సిపల్ చైర్‌పర్సన్ తాళ్లపాక అనురాధ ఆకస్మికంగా పరిశీలించి విద్యార్థుల చదువు, కంటి మరియు దంత ఆరోగ్య సమస్యల గురించి ఆత్మీయంగా అడిగి తెలుసుకున్నారు.
అనంతరం ఆమె మాట్లాడుతూ... మంత్రి నారాయణ ఒక ఎమ్మెల్యేగా అభివృద్ధి సంక్షేమంతో పాటు ప్రజలు, పిల్లల ఆరోగ్య రక్షణను బాధ్యతగా తీసుకుని కార్పొరేట్ వైద్యాన్ని ఉచితంగా అందిస్తున్నారని కొనియాడారు. విద్యార్థులకు ఎలాంటి కంటి లేదా దంత ఆరోగ్య సమస్యలు ఉన్నా మంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి ఉచితంగా శస్త్రచికిత్సలు, వైద్య సదుపాయాలు కల్పిస్తామని ఆమె స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో హెడ్ మాస్టర్ సతీష్, డివిజన్ వైస్ ప్రెసిడెంట్ శేఖర్, బిఎల్సి మల్లికార్జునరావు, సెక్రటరీలు అమర్ ,అజయ్ స్థానిక నేతలు తదితరులు పాల్గొన్నారు.




