Dutthaluru: శ్రీ వెంగమాంబ ‘పసుపు దంచు’ ఉత్సవం.. తరలివచ్చిన మహిళలు!
Dutthaluru: నర్రవాడ శ్రీ వెంగమాంబ పేరంటాలు అమ్మవారి బ్రహ్మోత్సవాల తొలి రోజు పసుపు దంచు ఉత్సవం భక్తజన సందోహం మధ్య అత్యంత వైభవంగా జరిగింది.
Dutthaluru: శ్రీ వెంగమాంబ ‘పసుపు దంచు’ ఉత్సవం.. తరలివచ్చిన మహిళలు!
దుత్తలూరు: నర్రవాడ శ్రీ వెంగమాంబ పేరంటాలు అమ్మవారి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా తొలి రోజు నిలు.పు సందర్భంగా నిర్వహించిన పసుపు దంచు ఉత్సవం ఘనంగా జరిగింది.
ఈ సందర్భంగా అమ్మవారికి సంప్రదాయబద్ధంగా పసుపు దంచు ఉత్సవం నిర్వహించారు. పెద్ద సంఖ్యలో మహిళా భక్తులు ఆలయానికి తరలివచ్చి భక్తి భావంతో పసుపు దంచి అమ్మవారికి సమర్పించారు. ఆలయ ప్రాంగణమంతా భక్తుల వెంగమాంబ నామస్మరణలు, ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది.
బ్రహ్మోత్సవాల తొలి రోజు జరిగిన ఈ ఉత్సవానికి పరిసర ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి పసుపు దంచారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆలయ అధికారులు, నిర్వాహకులు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేశారు.
Next Story




