Dutthalur: నర్రవాడ వెంగమాంబ బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై ఎమ్మెల్యే సమీక్ష!

Dutthalur: నెల్లూరు జిల్లా నర్రవాడ శ్రీ వెంగమాంబ అమ్మవారి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై కావలి ఆర్డీఓ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే కాకర్ల సురేష్ సమగ్ర సమీక్ష నిర్వహించారు.

VENKATA PRASAD, UDAYAGIRI
Published on: 26 Jun 2026 5:07 PM IST
Dutthalur
X

Dutthalur: నర్రవాడ వెంగమాంబ బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై ఎమ్మెల్యే సమీక్ష!

దుత్తలూరు: నెల్లూరు జిల్లా దుత్తలూరు మండలం నర్రవాడలో వెలసిన శ్రీ వెంగమాంబ పేరంటాల అమ్మవారి వార్షిక బ్రహ్మోత్సవాలు జూలై 5 నుంచి 9వ తేదీ వరకు వైభవంగా జరగనున్న నేపథ్యంలో, బ్రహ్మోత్సవాలకు వచ్చే లక్షలాది మంది భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచిస్తూ సమీక్షా సమావేశం నిర్వహించారు.

ఈ సమావేశానికి ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్ ముఖ్య అతిథిగా హాజరుకాగా, కావలి ఆర్డీఓ ఎలీషా ఆధ్వర్యంలో వివిధ శాఖల అధికారులతో ఏర్పాట్లపై సమగ్రంగా సమీక్షించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే కాకర్ల సురేష్ మాట్లాడుతూ, తెలుగు రాష్ట్రాల్లో సమ్మక్క–సారలమ్మ జాతర తర్వాత అత్యంత వైభవంగా నిర్వహించే ఆధ్యాత్మిక ఉత్సవాల్లో నర్రవాడ శ్రీ వెంగమాంబ బ్రహ్మోత్సవాలు ఒకటిగా ప్రత్యేక గుర్తింపు పొందాయని అన్నారు.

ప్రతి సంవత్సరం రాష్ట్ర నలుమూలలతో పాటు పొరుగు రాష్ట్రాల నుంచి కూడా సుమారు ఐదు లక్షల మంది భక్తులు అమ్మవారిని దర్శించుకునేందుకు తరలివస్తారని తెలిపారు. అంతటి భారీ భక్తజన సందోహాన్ని దృష్టిలో ఉంచుకుని అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి ఎలాంటి లోటుపాట్లు లేకుండా ఏర్పాట్లు పూర్తి చేయాలని అధ.

VENKATA PRASAD, UDAYAGIRI

VENKATA PRASAD, UDAYAGIRI

Next Story