Bandarupalli: ఆదర్శ పాఠశాలలో ఘనంగా జాతీయ పతాక ఆమోద దినోత్సవం!

Bandarupalli: నెల్లూరు జిల్లా ఆత్మకూరు మండలం బండారుపల్లి ఆదర్శ పాఠశాలలో హెచ్ఎం గడ్డం తిరుమలరెడ్డి ఆధ్వర్యంలో జాతీయ పతాక ఆమోద దినోత్సవం ఘనంగా జరిగింది.

TS Murthy, Atmakuru(Nellore)
Published on: 22 July 2026 10:34 PM IST
Bandarupalli
X

Bandarupalli: ఆదర్శ పాఠశాలలో ఘనంగా జాతీయ పతాక ఆమోద దినోత్సవం!

బండారుపల్లి: జాతీయ పతాక ఆమోద దినోత్సవాన్ని పురస్కరించుకుని నెల్లూరు జిల్లా ఆత్మకూరు మండలం బండారుపల్లి ఆదర్శ పాఠశాలలో బుధవారం జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి ఘనంగా ఉపాధ్యాయులు, విద్యార్థులు గౌరవ వందనం సమర్పించారు. ప్రధానోపాధ్యాయుడు గడ్డం తిరుమలరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో జాతీయ పతాక విశిష్టత, దాని రూపకర్త పింగళి వెంకయ్య సేవలను విద్యార్థులకు వివరించారు.

అనంతరం విద్యార్థులతో కలిసి జాతీయ గీతాన్ని ఆలపించి దేశభక్తి భావాన్ని చాటిచెప్పారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు చంద్రమోహన్ రెడ్డి, శ్రీనివాసులు రెడ్డి, నల్లమేకల చిన్నయ్యతో పాటు విద్యార్థినీ, విద్యార్థులు పాల్గొన్నారు.

TS Murthy, Atmakuru(Nellore)

TS Murthy, Atmakuru(Nellore)

Next Story