Nellore: నెల్లూరు నారాయణ ఇంజినీరింగ్ కళాశాలలో ఘనంగా ‘ప్రభంజన్–2026’!
Nellore: నెల్లూరు నారాయణ ఇంజినీరింగ్ కళాశాలలో జాతీయ స్థాయి మేనేజ్‌మెంట్ ఫెస్ట్ 'ప్రభంజన్-2026' ఘనంగా ప్రారంభమైంది. విజేతలకు బహుమతులు అందజేశారు.
Nellore: నెల్లూరు నారాయణ ఇంజినీరింగ్ కళాశాలలో ఘనంగా ‘ప్రభంజన్–2026’!
Nellore: నెల్లూరు నారాయణ ఇంజినీరింగ్ కళాశాలలో జాతీయ స్థాయి మేనేజ్‌మెంట్ ఫెస్ట్ ‘ప్రభంజన్–2026’ ఉత్సాహభరిత వాతావరణంలో ప్రారంభమైంది. నారాయణ గ్రూప్ డైరెక్టర్ షరణి పొంగూరు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకలకు 36 ప్రముఖ కళాశాలలకు చెందిన సుమారు 1,850 మంది మేనేజ్‌మెంట్ విద్యార్థులు హాజరయ్యారు. నారాయణ ఎంబీఏ విభాగం, బీస్మార్ట్ సంయుక్త నిర్వహణలో ఫెస్ట్‌ను ఏర్పాటు చేశారు.
షరణి పొంగూరు జ్యోతి ప్రజ్వలన చేసి ‘ప్రభంజన్–2026’ను అధికారికంగా ప్రారంభించారు. అనంతరం నారాయణ MBAలో NSE అకాడమీ భాగస్వామ్యంతో ఏర్పాటు చేసిన NSE SMART Labను ప్రారంభించారు. పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా విద్యార్థులకు AI, SQL, బిజినెస్ అనలిటిక్స్ వంటి ఆధునిక అంశాల్లో శిక్షణ అందిస్తున్నామని ఆమె తెలిపారు.
ఫెస్ట్‌లో భాగంగా నిర్వహించిన వివిధ మేనేజ్‌మెంట్ పోటీల్లో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. విజేతలకు మొత్తం రూ.1 లక్ష విలువైన నగదు బహుమతులను అందజేశారు. యువత ఉద్యోగాలు వెతికే స్థాయిని దాటి, భవిష్యత్తులో ఉద్యోగాలు కల్పించే స్థాయికి ఎదగాలని యూత్ ఐకాన్ శరత్ బాబు ఆకాంక్షించారు.
ఈ సందర్భంగా Academic Visionaries–2026 అవార్డు అందుకున్న నారాయణ MBA డీన్ డా. గంగినేని ధనంజయ్‌ను షరణి పొంగూరు అభినందించారు. NSPIRA డ్రైవ్ ద్వారా ఉద్యోగాలు సాధించిన విద్యార్థులను కూడా ఆమె ప్రత్యేకంగా అభినందించారు.
నారాయణ MBAకు IIRF–2026లో జాతీయ స్థాయిలో 117వ ర్యాంక్, ఆంధ్రప్రదేశ్‌లో 3వ స్థానం లభించిందని డీన్ డా. ధనంజయ్ తెలిపారు. ప్లేస్‌మెంట్‌లలో 28 మంది విద్యార్థులు ఉద్యోగాలు పొందగా, HR Connects కార్యక్రమం ద్వారా 58 మందికి ఇంటర్న్‌షిప్ అవకాశాలు కల్పించినట్లు వివరించారు. నెల్లూరు కార్పొరేషన్‌తో కలిసి 45 రోజుల ఇంటర్న్‌షిప్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని, NC-RIME సదస్సులో 125కు పైగా రీసెర్చ్ పేపర్లు సమర్పించినట్లు తెలిపారు.
NSE, Case Veda భాగస్వామ్యంతో ఫిన్‌టెక్, Power BI, NISM వంటి కోర్సుల్లో విద్యార్థులకు ప్రాక్టికల్ లెర్నింగ్ అందిస్తున్నట్లు పేర్కొన్నారు. ఫెస్ట్‌ల ద్వారా విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలు, బృంద స్ఫూర్తి, సమస్య పరిష్కార నైపుణ్యాలు పెరుగుతాయని డైరెక్టర్ దత్తాత్రేయ శర్మ, ప్రిన్సిపాల్ రవి ప్రసాద్ తెలిపారు.
ఫెస్ట్ నిర్వహణ కమిటీని మేనేజ్‌మెంట్ సెక్రటరీ వై. వినయ్ కుమార్ అభినందించారు. హెచ్‌ఓడీ డా. మాల్యాద్రి, కన్వీనర్ లక్ష్మీ నారాయణ, కో-ఆర్డినేటర్లు మాధురి, కావేరి తదితరుల ఆధ్వర్యంలో కార్యక్రమాలు కొనసాగుతున్నాయి.




