Podalakuru: పొదలకూరులో ఘనంగా 9వ జాతీయ పోషణ మాసం కార్యక్రమం!

Podalakuru: పొదలకూరు ఎంపీడీవో కార్యాలయంలో జాతీయ పోషణ మాసం కార్యక్రమం. తల్లులు, పిల్లలు ఆరోగ్యంగా ఉండటానికి పోషకాహారం ప్రాముఖ్యతను వివరించిన సీడీపీవో విజయలక్ష్మి.

Yellayya, Nellore
Published on: 23 Sept 2026 11:07 AM IST
Podalakuru
X

Podalakuru: పొదలకూరులో ఘనంగా 9వ జాతీయ పోషణ మాసం కార్యక్రమం!

Podalakuru: తల్లులు, పిల్లలు ఆరోగ్యంగా ఉండాలంటే పోషకాహారాన్ని తప్పనిసరిగా తీసుకోవాలని వెంకటాచలం ఐసీడీఎస్ సీడీపీవో వి. విజయలక్ష్మి సూచించారు. జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ పథక సంచాలకులు నాగ శైలజ ఆదేశాల మేరకు మంగళవారం పొదలకూరు ఎంపీడీవో సమావేశ మందిరంలో 9వ జాతీయ పోషణ మాసం కార్యక్రమంలో భాగంగా థీమ్‌–2 ఏఎంసీ సమావేశాన్ని నిర్వహించారు.సీడీపీవో విజయలక్ష్మి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో సమతుల ఆహారం, పోషక విలువలు, పరిశుభ్రత, ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లపై తల్లులు, పిల్లలకు అవగాహన కల్పించారు.

ఆహారం తీసుకునే సమయంలో పాటించాల్సిన జాగ్రత్తలను ప్రదర్శన ద్వారా వివరించి, పోషకాహారం వల్ల కలిగే ప్రయోజనాలను తెలియజేశారు. గర్భిణీలు, బాలింతలు, చిన్నారులకు అవసరమైన పోషక పదార్థాలపై అవగాహన కల్పించారు.అదేవిధంగా బాల్య వివాహాల నివారణ, బాలల సంరక్షణ అంశాలపై కూడా అవగాహన కల్పించారు. పిల్లల ఆరోగ్యకరమైన ఎదుగుదలకు పోషకాహారం, పరిశుభ్రత ఎంతో కీలకమని వివరించారు.ఈ కార్యక్రమంలో ఐసీడీఎస్‌ సూపర్‌వైజర్లు, అంగన్‌వాడీ కార్యకర్తలు, గర్భిణీలు, బాలింతలు పాల్గొన్నారు.

Yellayya, Nellore

Yellayya, Nellore