Nellore: నెల్లూరు ఎన్‌సీసీ క్యాంపులో అగ్నిమాపక దళం విన్యాసాలు.. క్యాడెట్లకు అవగాహన

Nellore: నెల్లూరు ధనలక్ష్మీపురంలో 10 ఆంధ్ర నేవల్ యూనిట్ ఎన్‌సీసీ వార్షిక శిక్షణ శిబిరం ఘనంగా జరుగుతోంది.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 14 May 2026 9:48 AM IST
Nellore
X

Nellore: నెల్లూరు ఎన్‌సీసీ క్యాంపులో అగ్నిమాపక దళం విన్యాసాలు.. క్యాడెట్లకు అవగాహన

నెల్లూరు: 10 ఆంధ్ర నేవల్ యూనిట్ ఎన్ సి సి నెల్లూరు లెఫ్ట్నెంట్ కమాండర్ మరియు క్యాంపు కమాండెంట్ గణేష్ గొదంగవే ఆధ్వర్యంలో యాన్యువల్ ట్రైనింగ్ క్యాంపు -20 ధనలక్ష్మి పురం లోని నారాయణ సిబియస్సీ రెసిడెన్సియల్ హైస్కూల్ నందు గత ఎనిమిది రోజులుగా నిర్వహింపబడుతున్న విషయం విధితమే.

ఈ క్యాంపుకు అడ్జటెంట్ గా వి. మల్లికార్జున్ రెడ్డి, ట్రైనింగ్ ఆఫీసర్ గా గుండాల నరేంద్రబాబు వ్యవహరించారు.

"ఆపత్కాలంలో ఆత్మ బంధువు అగ్నిమాపక దళం " మని క్యాంపు కమాండెంట్ అన్నారు.

"ప్రకృతి

విపత్తులు - ప్రతి స్పందన- అగ్ని మాపక దళం అందించే సేవలు" అను అంశంపై అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమానికి ఫైర్ మెన్లు ఎం.కమలాకర్ రావు, ఏ.ప్రసాద్ ముఖ్య అతిధులుగా విచ్చేశారు. ఈ సందర్భంగా వారు కేడేట్లను ఉద్దేశించి ప్రసంగిస్తూ...

బాల్య దశ నుంచే అందరూ కూడా ప్రకృతి విపత్తులు సంభవించి నప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, వాటి నివారణకు అగ్ని మాపక దళం అందించే విశిష్ట సేవలు, నిత్యం జీవితంలో వంట చేసే టప్పుడు, గ్యాస్ సిలిండర్ మండేటప్పుడు కంటే లీక్ అవుతున్నప్పుడు అత్యంత ప్రమాదకర మన్నారు.ఫైర్ మూడు రకాలని సాలిడ్ ఫైర్, మెటల్ ఫైర్,గ్యాస్ ఫైర్ లను ప్రయోగాత్మకంగా చేసి చూపిస్తూ క్యాడేట్లకు చక్కటి అవగాహన కల్పించారు.

అనంతరం ఫైర్మెన్లు కమలాకర్ రావు, ప్రసాద్ కు ట్రైనింగ్ ఆఫీసర్ గుండాల నరేంద్ర బాబు, ఛీఫ్ ఇన్స్ట్రక్టర్ లోకేష్ క్యాంపు కమాండెంట్ తరపున జ్ఞాపికలను బహూకరించారు.

ఈ శిక్షణా శిబిరంలో క్యాడేట్లకు శారీరక వ్యాయామం, నేవల్ ఓరియంటేషన్, రిగ్గింగ్, బోట్ వర్క్, షిప్ మోడలింగ్,

వెపన్ ఫైరింగ్, జాతీయ సమైక్యత ,సామాజిక సేవా,

లీడర్ షిప్ క్వాలిటీస్,సోషల్ అవేర్ నెస్,నేవల్ కమ్యూనికేషన్,సీమఫోర్ అంశాలపై శిక్షణ నిచ్చారు.డ్రిల్ కాంపిటేషన్, సాంస్కృతిక పోటీలు నిర్వహించారు.

కేడేట్లచే నిర్వహించబడిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరిని ఆకట్టుకున్నాయి.

ఈ శిక్షణా శిబిరంలో

షిప్ మోడలింగ్ ఇన్స్రక్టర్ రామన్,

సబ్ లెఫ్ట్నెంట్ ఎస్ కే. న్యామతుల్లా,సెకండ్ ఆఫీసర్లు పెంచల ప్రసాద్, ఎం.సురేష్,కె.సురేష్,,గర్ల్ చైల్డ్ ఇన్స్ట్రక్టర్ పూజిత,చీఫ్ ఇన్స్ట్రక్టర్ లోకేష్, పి.ఐ స్టాఫ్ రమణ,లక్ష్మణ్ కుమార్,లక్ష్మీ నారాయణ,నవీన్,దీపక్,శివ, పృథ్వి రాజ్, అనురాగ్, కేర్ టేకర్లు కార్తీక్, ఫరూక్ తదితరులు పాల్గొని కేడెట్లకు శిక్షణ నిచ్చారు.

ఈ క్యాంపుకు

గుంటూరు, నెల్లూరు, తిరుపతి జిల్లాలకు చెందిన వివిధ కళాశాలలు, ఉన్నత పాఠశాలలకు చెందిన ఎన్సిసి క్యాడెట్లు హాజరై శిక్షణ పొందుతున్నారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story