Nellore: వైయస్సార్‌సీపీలోకి భారీగా మైనార్టీ కుటుంబాల చేరిక
Nellore: నెల్లూరులో ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి సమక్షంలో వైయస్సార్‌సీపీలోకి చేరిన 30 మైనార్టీ కుటుంబాలు. కూటమి ప్రభుత్వ విధానాలపై ప్రజల్లో వ్యతిరేకత.
Nellore: వైయస్సార్‌సీపీలోకి భారీగా మైనార్టీ కుటుంబాల చేరిక
నెల్లూరు: MLC చంద్రశేఖర్ రెడ్డి ఇస్తున్న భరోసాతో.. 43 డివిజన్ నుంచి వై ఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీలో 30 మైనార్టీ కుటుంబాలు చేరాయి. నెల్లూరు రాంజీ నగర్ వైసిపి సిటీ ఆఫీస్ లో.. వైఎస్ఆర్సిపి నెల్లూరు నగర నియోజకవర్గ ఇంచార్జ్ ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ని వైఎస్ఆర్సిపి మైనార్టీ విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఖలీల్ అహ్మద్ సూచన మేరకు ..43 డివిజన్ నాయకులు జమీర్, ఖాదర్ ల ఆధ్వర్యంలో.. 30 మైనార్టీ కుటుంబాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరాయి.
పార్టీలో చేరిన వారికి ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి పార్టీ కండువా వేసి సాధారణంగా పార్టీలోకి ఆహ్వానించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలోపేతమే .. లక్ష్యంగా పనిచేస్తామని వారు చంద్రశేఖర్ రెడ్డికి తెలియజేశారు.
కూటమి ప్రభుత్వానికి ప్రజల్లో పెరుగుతున్న.. వ్యతిరేఖతకు.. నిదర్శనమే ఈ చేరికలని ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. మళ్లీ ఈ రాష్ట్రానికి జగన్ మోహన్ రెడ్డి ని ముఖ్యమంత్రిగా చేసుకోవాలని ప్రజలందరూ ఆకాంక్షిస్తున్నారని అన్నారు.
రాబోయే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో.. కార్యకర్తలకు సముచిత స్థానం గౌరవంతో పాటు.. ప్రజలందరికీ సంపూర్ణ న్యాయం దక్కుతుందని చంద్రశేఖర్ రెడ్డి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.




