Nellore: నెల్లూరు ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో వాలీబాల్ టోర్నీ.. ప్రారంభించిన కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి!
Nellore: నెల్లూరు ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో వేసవి శిక్షణ శిబిరం ముగింపు సందర్భంగా జిల్లా స్థాయి వాలీబాల్ పోటీలు నిర్వహించారు. ఈ టోర్నమెంట్‌ను టీడీపీ అధికార ప్రతినిధి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి ప్రారంభించారు.
Nellore: నెల్లూరు ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో వాలీబాల్ టోర్నీ.. ప్రారంభించిన కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి!
నెల్లూరు: నెల్లూరు ఏసి సుబ్బారెడ్డి స్టేడియంలో జరుగుతున్న వేసవి శిక్షణ శిబిరం వాలీబాల్ కోచింగ్ క్యాంప్ ముగింపు సందర్భంగా..నెల్లూరు జిల్లా వాలీబాల్ అసోసియేషన్ మరియు ఆంధ్రప్రదేశ్ కేడాపాధి సంస్థ సంయుక్తంగా వాలీబాల్ పోటీలను తేదీ 30.5.2026 నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా టిడిపి అధికార ప్రతినిధి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి పాల్గొని ప్రారంభించారు.
ఒలంపిక్ అసోసియేషన్ మహేష్ రెడ్డి పాల్గొని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి నెల్లూరు జిల్లా వాలీబాల్ అసోసియేషన్ ప్రెసిడెంట్ వెంకట్రామిరెడ్డి, సెక్రటరీ శ్రీనివాసులు రెడ్డి మరియు సీనియర్ వాలీబాల్ క్రీడాకారులు అసోసియేషన్ సభ్యులు వివిధ కోచింగ్ సెంటర్ నుంచి వాలీబాల్ క్రీడాకారులు పాల్గొన్నారు
వేసవి సమ్మర్ క్యాంప్ యొక్క ముఖ్య ఉద్దేశ్యం ప్రతి ఒక్కరిలో క్రీడా స్ఫూర్తిని నింపాలనే లక్ష్యంతో నిర్వహిస్తున్నామని తెలియజేశారు వాలీబాల్ అసోసియేషన్... జిల్లాస్థాయి నుండి రాష్ట్రస్థాయి, రాష్ట్ర స్థాయి నుంచి జాతీయ స్థాయికి వాలీబాల్ క్రీడాకారులు ఎదగాలని ఆకాంక్షించారు.




