Nellore: పోలీస్ శాఖ కీలక నిర్ణయం.. పోలీసుల పిల్లలకు ఉచిత చదువు

Nellore: నెల్లూరు జిల్లాలో పోలీస్ వెల్ఫేర్ విభాగం ఆధ్వర్యంలో పోలీసుల పిల్లలకు ఉచిత ఇంటర్ సీట్ల కౌన్సిలింగ్ నిర్వహించారు.

V. Narasimhulu, Nellore
Published on: 13 Jun 2026 8:59 PM IST
Nellore
X

Nellore: పోలీస్ శాఖ కీలక నిర్ణయం.. పోలీసుల పిల్లలకు ఉచిత చదువు

Nellore: నెల్లూరు జిల్లా పోలీస్ కుటుంబాల సంక్షేమ కార్యక్రమంలో భాగంగా, 10వ తరగతి మార్కుల ఆధారంగా 65 మంది విద్యార్థులకు ఉచితంగా, 40 మందికి 50% రాయితీతో ఇంటర్ సీట్లు కౌన్సిలింగ్ ద్వారా కేటాయించారు. జిల్లా పోలీస్ అధికారుల సంఘం, పోలీస్ వెల్ఫేర్ విభాగం ఆధ్వర్యంలో ప్రముఖ ప్రైవేట్ విద్యాసంస్థల సహకారంతో ఈ కార్యక్రమం నిర్వహించబడింది.

ముఖ్య అతిథిగా పాల్గొన్నారు అడిషనల్ ఎస్పీ (అడ్మిన్) Ch. సౌజన్య. పోలీసు సిబ్బంది పిల్లల విద్యాభివృద్ధికి పోలీస్ శాఖ కట్టుబడి ఉందని తెలిపారు. పోలీస్ కుటుంబాల సంక్షేమం, విద్యార్థుల ఉన్నత విద్యకు ప్రోత్సాహం అందించడమే ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యమని వెల్లడించారు ఎఎస్పీ సౌజన్య.

V. Narasimhulu, Nellore

V. Narasimhulu, Nellore

Next Story