Nellore: నెల్లూరులో టపాసుల దుకాణాలపై కలెక్టర్, ఎస్పీ మెరుపు తనిఖీలు!
Nellore: నెల్లూరు నగరంలో జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా, ఎస్పీ అజిత వేజెండ్ల విస్తృత తనిఖీలు.
Nellore: నెల్లూరులో టపాసుల దుకాణాలపై కలెక్టర్, ఎస్పీ మెరుపు తనిఖీలు!
Nellore: నెల్లూరు నగరంలో జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా, ఎస్పీ అజిత వేజెండ్ల విస్తృతంగా పర్యటించారు. శుక్రవారం సాయంత్రం నెల్లూరు నగరం పెన్నా నది పొర్లు కట్ట సమీపంలో ఉన్న టపాసుల విక్రయ దుకాణాలు, తయారీ కేంద్రాలను క్షుణ్ణంగా పరిశీలించారు. టపాసుల విక్రయానికి, తయారీకి వ్యాపారుల వద్ద లైసెన్సులను కలెక్టర్, ఎస్పీ పరిశీలించారు. అగ్ని ప్రమాదాల నివారణకు తీసుకుంటున్న జాగ్రత్తలను స్వయంగా పరిశీలించారు. మంటలు ఆర్పే అగ్నిమాపక పరికరాలు సక్రమంగా పనిచేస్తున్నాయో లేదో పరిశీలించారు. వ్యాపారులు, తయారీదారులు నిబంధనలు తప్పకుండా పాటిస్తూ ఎటువంటి అగ్ని ప్రమాదాలు జరగకుండా అన్ని ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఎవరైనా నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ తనిఖీల్లో ఆర్డీవో అనూష, తాసిల్దార్ షఫీ మాలిక్ తదితరులు పాల్గొన్నారు.




