Nellore: టీడీపీ కార్యాలయం వద్ద ఘనంగా 'నిజం గెలిచింది' కార్యక్రమం

Nellore: నెల్లూరు టీడీపీ కార్యాలయం వద్ద చంద్రబాబు 53 రోజుల నిర్బంధానికి మూడేళ్లు పూర్తయిన సందర్భంగా ఆనం రంగమయూర్ రెడ్డి ఆధ్వర్యంలో 'నిజం గెలిచింది' వేడుక.

A Praveen, Nellore
Published on: 9 Sept 2026 10:03 PM IST
Nellore
X

Nellore: టీడీపీ కార్యాలయం వద్ద ఘనంగా 'నిజం గెలిచింది' కార్యక్రమం

నెల్లూరు: తెలుగుదేశం పార్టీ అధినేత, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గత ప్రభుత్వ హయాంలో ఎదుర్కొన్న 53 రోజుల నిర్బంధాన్ని ఖండిస్తూ... నెల్లూరు ఏసీ సెంటర్‌లోని తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద ఆనం రంగమయూర్ రెడ్డి ఆధ్వర్యంలో ‘నిజం గెలిచింది’ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో స్థానిక యువత, మహిళా నాయకులు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలతో పాటు ఆనం కుటుంబ అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ‘నిజం గెలిచింది.. చంద్రబాబు నాయకత్వం వర్ధిల్లాలి’ అంటూ చేసిన నినాదాలతో పార్టీ కార్యాలయ పరిసరాలు మార్మోగాయి.

ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు రాజకీయ జీవితంలో ఎదుర్కొన్న సవాళ్లు, రాష్ట్ర ప్రజల కోసం ఆయన చేసిన త్యాగాలు, కష్టకాలంలో చూపిన ధైర్యం, పట్టుదలను ప్రత్యేకంగా ప్రస్తావించారు. 53 రోజుల

“అక్రమ నిర్బంధాలు చంద్రబాబు ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయలేకపోయాయి. ప్రజల కోసం ఆయన చేసిన పోరాటం, త్యాగనిరతి చివరకు విజయం సాధించాయి. ప్రజల విశ్వాసమే చంద్రబాబు బలం.. అందుకే నిజం గెలిచింది” అని నాయకులు పేర్కొన్నారు.

కార్యక్రమం ఆద్యంతం ‘నిజం గెలిచింది’, ‘చంద్రబాబు నాయకత్వం వర్ధిల్లాలి’ అంటూ యువత, మహిళలు, పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున తమ అభిమానాన్ని చాటారు.

A Praveen, Nellore

A Praveen, Nellore

Next Story