Nellore: ఫతేఖాన్ పేటలో జనాజా గుసుల్ ఖానా ప్రారంభం

Nellore: నెల్లూరు ఫతేఖాన్ పేట కలాన్ మసీదులో జనాజా గుసుల్ ఖానాను ప్రారంభించిన ఏపీ వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్. దాత చాన్ బాషాకు అభినందనలు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 1 Aug 2026 6:22 AM IST
Nellore
X

Nellore: ఫతేఖాన్ పేటలో జనాజా గుసుల్ ఖానా ప్రారంభం

నెల్లూరు: నెల్లూరులోని ఫతేఖాన్ పేట లో గల కలాన్ మసీదు లో నిర్మాణ దాత ఎస్బీటీ చాన్ బాషా సహకారంతో జనాజ గుసుల్ ఖానా నిర్మించారు. గుసుల్ ఖానా ను ఏపీ వక్ఫ్ బోర్డ్ చైర్మన్ అబ్దుల్ అజీజ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా అబ్దుల్ అజీజ్ మాట్లాడుతూ, బాడుగ ఇళ్లల్లో ఉన్నవారు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని వారికి ఉపయోగపడాలని జనాజ గుసుల్ ఖానా నిర్మించారని తెలిపారు.

బడుగు ఇళ్లలో సౌకర్యం లేనటువంటి వారికి ఇక్కడ అంత్యక్రియలు నిర్వహిస్తారని తెలిపారు. నిర్మాణదాత ఎస్ బి టి చాన్ బాషా వారి కుటుంబ సభ్యులను ఆ దేవుడు చల్లగా చూడాలని అన్నారు. గతంలో తను మేయర్ గా ఉన్నప్పుడు వైశ్య సామాజికవర్గంవారు వారి సామాజిక వర్గం వారికి కర్మకృతువులు చేసుకునేందుకు స్థలం కేటాయించమని అడిగారని, వారు ఎలా అయితే కట్టుకుంటారో ఇతర సామాజిక వర్గం వారు కూడా అలాగే కట్టించి ఇవ్వాలని అడిగితే ట్విన్ బిల్డింగ్ కట్టి మున్సిపల్ కార్పొరేషన్ కు రిజిస్టర్ చేశారని గుర్తు చేసుకున్నారు.

రాష్ట్రవ్యాప్తంగా అవసరం ఉన్న ప్రతి చోట వక్ఫ్ బోర్డు ఆధ్వర్యంలో గుసుల్ ఖానాలు నిర్మిస్తామని తెలిపారు. అన్ని సామాజిక వర్గాల్లో దాతలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో నన్నే సాహెబ్, మైనుద్దిన్, కరిముల్లా, సమీ హుస్సేనీ, సలీం, సాబీర్ ఖాన్, హయత్ బాబా, రియాజ్, అన్వర్, రసూల్, పాషా మొహిద్దిన్, జాబీర్ తదితరులు పాల్గొన్నారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story