Nellore: అల్లీపురం డంపింగ్ యార్డ్‌ను పరిశీలించిన ఏపీపీసీబీ చైర్మన్
Nellore: నెల్లూరు అల్లీపురంలోని డంపింగ్ యార్డ్‌ను ఏపీపీసీబీ చైర్మన్ పి. కృష్ణయ్య పరిశీలించి, అక్కడ చేపట్టాల్సిన అభివృద్ధి పనులపై అధికారులకు దిశానిर्देशం చేశారు.
Nellore: అల్లీపురం డంపింగ్ యార్డ్‌ను పరిశీలించిన ఏపీపీసీబీ చైర్మన్
నెల్లూరు: ఆంధ్రప్రదేశ్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ చైర్మన్ పి. కృష్ణయ్య రిటైర్డు ఐ.ఏ.యస్. స్థానిక అల్లీపురంలోని నెల్లూరు నగరపాలక సంస్థకు చెందిన డంపింగ్ యార్డ్ ను అధికారులతో కలిసి సోమవారం పరిశీలించారు.
సుమారుగా 6.6 యకరాల విస్తీర్ణంలో ఉన్న డంపింగ్ యార్డ్ లో వ్యర్ధాలను పూర్తిస్థాయిలో తొలగించినందున ఆ ప్రాంతంలో థీమ్ పార్కు, మొక్కల పెంపకం లేదా ఇతర అధునాతనమైన నిర్మాణాలను చేపట్టేందుకు అవకాశాలను పరిశీలించాలని ఆయన సూచించారు.
ఆ ప్రాంతం మొత్తం ఎక్కువకాలం డంపింగ్ యార్డ్ గా ఉన్నందువలన మట్టి, భూగర్భ జలాలు కలుషితమైపోయే అవకాశం ఉన్నందున.. పూర్తిస్థాయిలో పరీక్షలను నిర్వహించి, ఫలితాలను విశ్లేషించిన తర్వాతనే ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలను అయినా చేపట్టాలని ఆయన సూచించారు.
ఈ కార్యక్రమంలో నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ వై.ఓ నందన్, ఇంజనీరింగ్ విభాగం అధికారులు ఎస్.ఈ రహంతు జానీ,ఈ.ఈ. చంద్రయ్య , అసిస్టెంట్ డైరెక్టర్ హార్టికల్చర్ నరసింహారావు,పబ్లిక్ హెల్త్ విభాగం ఈ.ఈ గిరిధర్, సిబ్బంది పాల్గొన్నారు.




