Nellore: నెల్లూరు జిల్లాలో ‘స్వచ్ఛ ఆంధ్ర - స్వచ్ఛ ఆర్టీసీ
Nellore: నెల్లూరు జిల్లా ఆర్టీసీ గుడ్ న్యూస్ చెప్పింది. 'స్వచ్ఛ ఆంధ్ర - స్వచ్ఛ ఆర్టీసీ'లో భాగంగా ఎండల తీవ్రత దృష్ట్యా అన్ని బస్టాండ్లలో చలివేంద్రాలు ఏర్పాటు
Nellore: నెల్లూరు జిల్లాలో ‘స్వచ్ఛ ఆంధ్ర - స్వచ్ఛ ఆర్టీసీ
Nellore: నెల్లూరు జిల్లా ప్రయాణికులకు మరింత చేరువలో ఆర్టీసీ సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఈ రోజు నెల్లూరు జోనల్ ఆర్టీసీ ఛైర్మన్ సన్నపురెడ్డి సురేష్ రెడ్డి ఆధ్వర్యంలో ఆల్ డిపో మేనేజర్స్ మీటింగ్ లో అన్నీ బస్ స్టేషన్ల లో కనీస మౌలిక సదుపాయాలు, వసతులు, అనగా "స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ ఆర్టీసీ " కార్యక్రమం లో భాగంగా ఎండ వేడిమి కి ప్రయాణికులు ఎటువంటి ఇబ్బందులు పడకుండా వాటర్ కూలర్లు, చిన్న చిన్న బస్ స్టేషన్ లలో చలివేంద్రాలు ఏర్పాటు చేసి,
ప్రయాణికులకు ఎండ వేడిమి తగలకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసి, టాయిలెట్స్ శుభ్రంగా ఉంచేందుకు కలరా ఉండలు, డి.యం మరియు సి ఐ లకు యాఫ్రన్ లు, ఆయా బస్ స్టేషన్ లలో ఉన్న ప్రయాణికులకు అనౌన్స్మెంట్ చేయుటకు కంట్రోల్ పాయింట్ లలో మైక్ లు వితరణ చేసి, ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించి, నెల్లూరు ను ప్రథమ స్థానంలో ఉంచాలని దానికి తగిన విధంగా ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని కోరడం జరిగింది.. ఈ కార్యక్రమంలో గౌరవ DPTO షేక్ షమీమ్, P.O. A.V రమణ, ఆల్ డిపో మేనేజర్స్ పాల్గొని విజయవంతం చేశారు.




