Nellore: ఆర్టీసీ సిబ్బందికి మెడికల్ కిట్లు పంపిణీ చేసిన నెల్లూరు డీఎంహెచ్‌ఓ

Nellore: ఎండలు, వడగాల్పుల నేపథ్యంలో శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో వినూత్న కార్యక్రమం చేపట్టారు.

V. Narasimhulu, Nellore
Published on: 1 Jun 2026 8:30 AM IST
Nellore
X

Nellore: ఆర్టీసీ సిబ్బందికి మెడికల్ కిట్లు పంపిణీ చేసిన నెల్లూరు డీఎంహెచ్‌ఓ

Nellore: ఓవైపు మండుతున్న ఎండలు, వడగాల్పుల నేపథ్యంలో, ఒక్కరోజు ఆర్టిసి బస్సులో ప్రయాణం చేయాలంటేనే సహజంగా మనం ఉక్కిరి బిక్కిరి అవుతూ ఉంటాం. అలాంటిది రోజు మొత్తం, ఆర్టీసీ బస్సులోనే గంటల తరబడి ప్రయాణం చేస్తూ. ప్రయాణికులకు ఓవైపు ఏ ఇబ్బంది లేకుండా చూసుకుంటూ రద్దీగా ఉన్న బస్సుల్లో, సీట్లు గురించి గొడవపడే ప్రయాణికులకు సర్ది చెబుతూ.. నిలబడి ప్రయాణించే ప్రయాణికులతో మాట్లాడుతూ.. రోజు మొత్తం బిజీ బిజీగా ఆర్టీసీ విధులు నిర్వహిస్తున్న సిబ్బంది గురించి ఓసారి ఆలోచిస్తే అర్థమవుతుంది వారు మనుషులేనని వారూ మనలాగేనని అలాంటి ఆర్టీసీ సిబ్బంది కోసం.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా APSRTC మెయిన్ బస్టాండ్ నందు సన్నపురెడ్డి సురేష్ రెడ్డి (జోనల్ చైర్మన్ ఏ పి ఎస్ ఆర్ టి సి. ) , అత్యధిక ఉష్ణోగ్రతలతో వేసవికాలం కొనసాగుతున్న అందువలన డ్యూటీ మీద వెళ్ళు ఆర్టీసీ సిబ్బందికి అత్యవసర ప్రయాణాలు చేయుచున్న ప్రయాణికులకు సహాయముగా, DMHO వి. సుజాతని ORS మరియు మెడికల్ కిట్లను అందజేయవలసిందిగా కోరగా నెల్లూరు జిల్లా అన్ని బస్ డిపోలలో ఈరోజు నుండి ఏర్పాటు చేయడం జరుగుతున్నదని చెప్పారు.

ఇలా ఏర్పాటు చేయించిన చైర్మన్ కి DMHO కి నెల్లూరు జిల్లా ఆర్టీసీ సిబ్బంది కృతజ్ఞతలు తెలిపి, సంతోషం వ్యక్తపరిచినారు.

V. Narasimhulu, Nellore

V. Narasimhulu, Nellore

Next Story