Nellore: ఆక్వా సాగులో వ్యాధి నిర్ధారణ పద్ధతులపై వర్క్‌షాప్
Nellore: నెల్లూరు ఆక్వా ల్యాబ్‌లో ఆక్వా సాగులో వ్యాధి నిర్ధారణ సాధనాలు, పద్ధతులపై మత్స్యశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన వర్క్‌షాప్ విజయవంతమైంది.
Nellore: ఆక్వా సాగులో వ్యాధి నిర్ధారణ పద్ధతులపై వర్క్‌షాప్
నెల్లూరు: రాష్ట్ర మత్స్య సాంకేతిక పరిజ్ఞాన సంస్థ (SIFT), కాకినాడ ప్రిన్సిపాల్ డా. S. అంజలి ఆదేశాల మేరకు, మత్స్యశాఖ ఆధ్వర్యంలో నెల్లూరు ఆక్వా ల్యాబ్‌లో మంగళవారం “ఆక్వా సాగులో వ్యాధి నిర్ధారణ సాధనాలు మరియు పద్ధతులు” (Disease Diagnosis Tools and Methods in Aquaculture) అంశంపై ఒకరోజు వర్క్‌షాప్ విజయవంతంగా నిర్వహించబడింది.
ఈ కార్యక్రమాన్ని APSADA కో-వైస్ చైర్‌పర్సన్ ఆనం వెంకటరమణారెడ్డి మరియు జిల్లా మత్స్యశాఖ అధికారి, నెల్లూరు పి. లక్ష్మణ్ రావు ప్రారంభించారు. రొయ్యల రైతులు శాస్త్రీయ పద్ధతులను అవలంబించడం ద్వారా అధిక దిగుబడులతో పాటు నాణ్యమైన ఉత్పత్తిని సాధించవచ్చని వారు తెలిపారు.
"వర్క్‌షాప్‌లో ప్రసంగించిన నిపుణులు"
1. డాక్టర్ అమర్నేని రవికుమార్, ఆక్వాకల్చర్ నిపుణులు – ఆక్వా సాగులో సంభవించే వ్యాధుల నిర్ధారణకు అవసరమైన పరిశీలన, శాంపిల్ సేకరణ, శాంపిల్ తయారీ మరియు విశ్లేషణ పద్ధతులపై వివరించారు.
2. డాక్టర్ T. నీరజ, ప్రొఫెసర్ & హెడ్, అనిమల్ హెల్త్ డివిజన్, ఫిషరీస్ కాలేజ్, ముత్తుకూరు – రొయ్యల సాగులో సంభవించే వ్యాధుల నిర్ధారణకు సంబంధించిన “Levels of Diagnosis” గురించి వివరించారు.
3. కె. లక్ష్మి, జి.ఎం., సి.పి. ఆక్వా – ఆక్వాకల్చర్‌లో వ్యాధి నిర్ధారణకు ఉపయోగించే PCR మరియు qPCR (Real-Time PCR) డయాగ్నస్టిక్ పద్ధతుల గురించి వివరించారు.
4. డాక్టర్ సాధు హరి, శాస్త్రవేత్త, కేవీకే, నెల్లూరు – నీటి నాణ్యత, ఆరోగ్య పర్యవేక్షణ మరియు వ్యాధి నిర్వహణలో పోషకాహారం ప్రాముఖ్యత గురించి వివరించారు.
సాంకేతిక సమావేశాల అనంతరం రైతులతో సందేహ నివృత్తి కార్యక్రమం నిర్వహించారు. నిపుణులు రైతులు అడిగిన ప్రశ్నలకు సమగ్ర సమాధానాలు అందించారు. అనంతరం పాల్గొన్న రైతులకు రొయ్యల సాగు మరియు చేపల సాగుకు సంబంధించిన వివిధ రకాల కరపత్రాలను అందజేసి కార్యక్రమాన్ని ముగించారు.
ఈ కార్యక్రమాన్ని P. కిరణ్ కుమార్, అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ ఫిషరీస్ (ADF–SIFT) సమన్వయం చేశారు. కార్యక్రమంలో NSPAAD, YP–II N. N. చైతన్య, అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ ఫిషరీస్ (ADF) శ్రీ S. K. చాంద్ బాషా, ఫిషరీస్ డెవలప్‌మెంట్ ఆఫీసర్ (FDO) T. సునీతతో పాటు ఇతర బృంద సభ్యులు పాల్గొన్నారు.




