Nellore: అలిగి వెళ్లిన బాలికను గంటల్లోనే పట్టుకున్న ఎస్సై జిలాని

Nellore: నెల్లూరు జిల్లా ఏఎస్‌పేటలో తల్లి మందలించడంతో ఇల్లు వదిలి వెళ్లిన వరంగల్ బాలిక ఆయుష. బాలికను క్షేమంగా రక్షించి తల్లిదండ్రులకు అప్పగించిన ఎస్సై జిలాని.

TS Murthy, Atmakuru(Nellore)
Published on: 4 Jun 2026 9:38 PM IST
Nellore
X

Nellore: అలిగి వెళ్లిన బాలికను గంటల్లోనే పట్టుకున్న ఎస్సై జిలాని

Nellore: నెల్లూరు జిల్లా ఏఎస్‌పేట మండల కేంద్రంలో నివసిస్తున్న ఓ కుటుంబానికి చెందిన ఆయుష అనే బాలిక తల్లి మందలించడంతో ఇంటి నుంచి వెళ్లిపోయింది. వరంగల్‌కు చెందిన ఈ కుటుంబం జీవనోపాధి కోసం ఏఎస్‌పేటలో ఉంటోంది. బాలిక కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు ఎస్సై జిలానీకి ఫిర్యాదు చేశారు.

వెంటనే స్పందించిన ఎస్సై తన సిబ్బందితో గాలింపు చేపట్టి బాలికను గుర్తించి పోలీస్ స్టేషన్‌కు తీసుకువచ్చారు. అనంతరం ఆమెను తల్లి, కుటుంబ సభ్యులకు క్షేమంగా అప్పగించారు. తమ కుమార్తెను సురక్షితంగా అప్పగించిన ఎస్సై జిలానీ, పోలీసు సిబ్బందికి కుటుంబ సభ్యులు ధన్యవాదాలు తెలిపారు.

TS Murthy, Atmakuru(Nellore)

TS Murthy, Atmakuru(Nellore)

Next Story