Nellore: ఆడబిడ్డలకు శ్రీరామరక్ష.. ఈ ఒక్క యాప్ ఉంటే చాలు!
Nellore: నెల్లూరు జిల్లా సంగం బాలికల గురుకుల పాఠశాలలో శక్తి యాప్‌పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
Nellore: ఆడబిడ్డలకు శ్రీరామరక్ష.. ఈ ఒక్క యాప్ ఉంటే చాలు!
నెల్లూరు జిల్లా: నెల్లూరు జిల్లా సంగంలోని స్థానిక బాలికల గురుకుల పాఠశాలలో ఎస్సై రాజేష్ ‘శక్తి యాప్’పై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సీఐ శ్రీనివాసరెడ్డి, ఐసిడిఎస్ సీడీపిఓ సునీలత, ఏపీఏం రవిశంకర్ రెడ్డి హాజరై విద్యార్థినులకు యాప్ ఉపయోగాలు, అత్యవసర పరిస్థితుల్లో ఎలా వినియోగించుకోవాలో వివరించారు. మహిళల భద్రత కోసం ప్రభుత్వం అందుబాటులోకి తీసుకువచ్చిన ఈ యాప్‌ను ప్రతి విద్యార్థిని తప్పనిసరిగా డౌన్‌లోడ్ చేసుకుని ఉపయోగించుకోవాలని సూచించారు.మహిళలు అప్రమత్తంగా ఉండి, అత్యవసర సమయంలో శక్తి యాప్ ద్వారా తక్షణ సహాయం పొందవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏ ఎస్ ఐ ప్రసాద్ రావు,ఐసిడిఎస్ సూపర్వైజర్ రమాదేవి ,ప్రిన్సిపాల్ సునీత పాల్గొన్నారు.
Next Story




