Nellore: నెల్లూరు ఫతేఖాన్‌పేటలో ఘనంగా బాలగణపతి ఉత్సవాలు!

Nellore: నెల్లూరు ఫతేఖాన్‌పేటలో వినాయక నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఉత్సవాల్లో భాగంగా నిర్వహించిన లడ్డూ వేలంపాటలో భక్తులు రూ.50,116కు దక్కించుకున్నారు.

A Praveen, Nellore
Published on: 25 Sept 2026 8:48 AM IST
Nellore
X

Nellore: నెల్లూరు ఫతేఖాన్‌పేటలో ఘనంగా బాలగణపతి ఉత్సవాలు!

Nellore: నగరంలోని ఫతేఖాన్‌పేట పెండెంవారి వీధిలో బాలగణపతి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో వినాయక నవరాత్రి ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా బాలగణపతి స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తిశ్రద్ధలతో పూజా కార్యక్రమాలు చేపట్టారు.

అనంతరం గణపతి మండపం సమీపంలో ఏర్పాటు చేసిన వేదికపై ఆర్కెస్ట్రా కళాకారులచే నిత్య ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు. సంగీత, సాంస్కృతిక కార్యక్రమాలతో ఉత్సవ ప్రాంగణం సందడిగా మారుతోంది. స్థానికులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాలను వీక్షిస్తున్నారు.

ఉత్సవాల్లో భాగంగా బాలగణపతి స్వామివారి లడ్డూ ప్రసాదానికి వేలం పాట నిర్వహించారు. ఉత్సాహంగా సాగిన వేలం పాటలో రూ.50,116కు రోహిత్, మనోజ్, మాధవ, అనిల్ లడ్డూ ప్రసాదాన్ని దక్కించుకున్నారు. ఈ సందర్భంగా ఉత్సవ కమిటీ సభ్యులు వేలం పాటలో పాల్గొన్న వారిని అభినందించారు. భక్తుల భాగస్వామ్యంతో బాలగణపతి ఉత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయని కమిటీ సభ్యులు తెలిపారు.

A Praveen, Nellore

A Praveen, Nellore