Nellore: నెల్లూరులో బలిజ భవన్ ప్రారంభించిన మంత్రి నారాయణ
Nellore: నెల్లూరు బాలాజీ నగర్‌లో నూతనంగా నిర్మించిన బలిజ భవన్‌ను ఏపీ పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ ప్రారంభించారు.
Nellore: నెల్లూరులో బలిజ భవన్ ప్రారంభించిన మంత్రి నారాయణ
నెల్లూరు: నెల్లూరు నగరంలోని బాలాజీ నగర్ లో నిర్మించిన బలిజ భవన్ నీ ఏపీ పురపాలక పట్టిన అభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ ప్రారంభించారు. బలిజ భవన్ ప్రారంభానికి రాష్ట్ర నలుమూలల నుంచి వచ్చిన బలిజ సంఘం నాయకులకు స్థానిక బలిజభవన్ నిర్వాహకులు ఘన స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ...బలిజ భవన్ కళ్యాణ మండపం ప్రారంభోత్సవానికి హాజరుకావడం ఎంతో సంతోషంగా ఉందన్నారు.భవన నిర్మాణానికి కృషి చేసిన సంఘ పెద్దలకు, దాతలకు నా హృదయపూర్వక అభినందనలు తెలిపారు. బలిజ భవనం నిర్మాణం ప్రాధాన్యత వెనుక దశాబ్దాల చరిత్ర ఉంధన్నారు.1979లో స్వర్గీయ ఎన్.జి.కె. మూర్తి,పసుపులేటి రామ్మూర్తి, నక్క బాలకోటయ్య, జి.ఎల్. నరసింహారావు, ముత్యాల చంద్రమోహన్, పగడాల ప్రభాకర్ రావు, సిద్ధంశెట్టి రాధాకృష్ణయ్య, పట్నం ఈశ్వరరావు తదితర పెద్దలు భవనం కోసం బాలాజీ నగర్ లో స్థలాన్ని కొనుగోలు చేశారన్నారు.
గత 2022లో నూతన కమిటీ చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన డివిఎస్ గిరి బలిజభవన్ నిర్మాణ సంకల్పంతో ముందుకు సాగాన్నారు.2023 సెప్టెంబర్ 10న బలిజ భవన్ కళ్యాణ మండపానికి శంకుస్థాపన చేశామన్నారు.ఈ నిర్మాణానికి తన వంతుగా రూ.55 లక్షలు, చదలవాడ కృష్ణమూర్తి రూ.33 లక్షలు, డివిఎస్ గిరి రూ.18 లక్షలు అందించడంతో పాటు అనేక మంది కాపులు సహకరించారని మంత్రి వివరించారు. తాము కాపు భవన్ కి రెండు కోట్లు ఆర్ధిక సహాయం చసినట్లు చెప్పారు. ఇప్పటికే ఈ భవనం నుంచి పేద బలిజ కాపు వర్గాలకు ఆర్థిక సాంఘిక సామాజికంగా సహకారాన్ని అందిస్తుందని మంత్రి వివరించారు.అమృత కలశం ద్వారా ప్రతి నెల నిరుపేద, ఆసరా లేని కుటుంబాలకు 25 కిలోల బియ్యం, నిత్యావసర సరుకులు అందిస్తున్నార న్నారు.
ఇప్పటివరకు సుమారు రూ.5 లక్షలతో 250 కుటుంబాలకు ఈ సేవ అందించడం గొప్ప విషయని నిర్వాహకులను మంత్రి కొనియాడారు.విద్యలో వెనకబడటం వల్లే బలిజలు అవకాశాలు కోల్పోతున్నారన్నారు.విద్య మధ్యలో ఆగిపోకుండా పిల్లల చదువుకు ఇప్పటివరకు సుమారు రూ.3 లక్షలతో 100 కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించడం అభినందనీయమని చెప్పారు.
కుట్టు మిషన్లు అందించటం అభినందనీయం బలిజ పవన్ ప్రారంభోత్సవానికి హాజరైన బొలిశెట్టి శ్రీనివాస్, చదలవాడ కృష్ణమూర్తి.. మాజీ ఎమ్మెల్సీ మాదాసు గంగాధరం,కాపు నేతలు ఆరేటి ప్రకాశ్,చలమయ్య నాయుడు,సుధాకర్,డీవీఎస్ గిరి,పసుపులేటి రామ్మూర్తి,చాట్ల నరసింహారావు,డాక్టర్ పోకల రవి ,కొట్టే రామ్మూర్తి,మహేష్,కొట్టే సాయి,కమిటీ సభ్యులు పాల్గొన్నారు.




