Nellore: నెల్లూరు బారా షహీద్ దర్గా కమిటీ ప్రమాణ స్వీకారం.. హాజరైన మంత్రి

Nellore: మత సామరస్యానికి ప్రతీక అయిన నెల్లూరు బారా షహీద్ దర్గా ఫెస్టివల్ కమిటీ ప్రమాణ స్వీకారం వైభవంగా జరిగింది.

V. Narasimhulu, Nellore
Published on: 22 Jun 2026 9:50 PM IST
Nellore
X

Nellore: నెల్లూరు బారా షహీద్ దర్గా కమిటీ ప్రమాణ స్వీకారం.. హాజరైన మంత్రి

Nellore: మత సామరస్యానికి ప్రతీక అయిన నెల్లూరు బారా షాహిద్ దర్గా ఫెస్టివల్ కమిటీ ప్రమాణ స్వీకార మహోత్సవం వైభవంగా జరిగింది. రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖా మంత్రి మంత్రి నారాయణ, ఎంఎల్ఏ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, మేయర్ సుజాతా అశోక్,రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్,డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్,టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి పాల్గొన్నారు. సభ్యులకు ఐడీ కార్డులు అందచేశారు మంత్రి, ఎంఎల్ఏ అనంతరం బారా షహీద్ ల సమాధులను దర్శించి, ప్రత్యేక ప్రార్థనలు చేశారు మంత్రి నారాయణ.

ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ..

ఫెస్టివల్ కమిటీ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపిన అనంతరం దర్గా అభివృద్ధికి వైఎస్ఆర్సీపీ నిధులు ఇవ్వలేదని, సీఎం చంద్రబాబు ఐదు కోట్లు కేటాయించారని, ఏర్పాట్లు బాగా చేస్తుండటంతో భక్తుల సంఖ్య నాలుగు లక్షల నుంచి 14 లక్షలకు పెరిగిందని చెప్పారు.

రొట్టెల పండుగలో పారిశుధ్యానికి పెద్దపీట వేస్తున్నామని, వచ్చిన భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలుగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తామని చెప్పారు. దర్గా సర్వతోముఖాభివృద్ధికి నా శాయశక్తులా కృషి చేస్తానని హామీ ఇచ్చారు మంత్రి నారాయణ.

వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్ మాట్లాడుతూ..

గత 2014 లో నారాయణ మంత్రిగా ఉన్నప్పుడే దర్గా అభివృద్ధికి పునాదులు పడ్డాయని, స్వర్ణాల చెరువులో రొట్టెలు పట్టుకొనేందుకు ఘాట్ లు ఏర్పడ్డాయని, మరుగు దొడ్ల నిర్మాణం జరిగిందని చెప్పారు. రూ. 20 కోట్లతో కన్వెన్షన్ సెంటర్ కి శ్రీకారం చుట్టామని, వైసిపి హయాంలో పనులు ఆగిపోయాయని, కూటమి పాలనలో దర్గాకి మళ్లీ మంచిరోజులు వచ్చాయని తెలిపారు.

ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ..

ఫెస్టివల్ కమిటీ అధ్యక్షులు మునీర్ బాషా,సభ్యులకు అభినందనలు తెలిపారు. రాజకీయాలకు సంబంధం లేకుండా 30 ఏళ్లుగా దర్గాకి తాను భక్తుడినని, దర్గా లో రొట్టెలు పట్టుకొని కోరిన కోర్కెలన్నీ తీరాయని, కేంద్రమంత్రిగా ఉన్నప్పుడు వెంకయ్య నాయుడు దర్గా అభివృద్ధికి తన వంతు కృషి చేశారని, అద్భుతమైన ఈద్గా, ముఖద్వారాలు నా హయాం లో నిర్మించటం నా అదృష్టం అని అన్నారు .

వైఎస్ఆర్సీపీ హయాంలో దర్గా అభివృద్ధికి పోరాటం చేశానని, మంత్రి నారాయణ సహకారంతో దర్గా సంపూర్ణ అభివృద్ధికి కృషి చేస్తానని చెప్పారు. అజీజ్ ఆధ్వర్యంలో రొట్టెల పండుగ నిర్వహణ జరుగుతుందని, అజీజ్ కి తమ సంపూర్ణ సహకారం అందిస్తామని అన్నారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చూడాలని, అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి.

V. Narasimhulu, Nellore

V. Narasimhulu, Nellore

Next Story