Nellore: నెల్లూరులో బీసీల నిరసన గళం.. వైసీపీ తీరుపై తీవ్ర ఆగ్రహం!

Nellore: నెల్లూరులో బీసీ నాయకుల భారీ నిరసన ప్రదర్శన. వైసీపీ హయాంలో బీసీ రిజర్వేషన్లకు కోత పెట్టారంటూ ఆగ్రహం వ్యక్తం చేసిన బీసీ నేతలు.

Arun Chilukuri
Published on: 3 Oct 2026 3:07 PM IST
Nellore
X

Nellore: నెల్లూరులో బీసీల నిరసన గళం.. వైసీపీ తీరుపై తీవ్ర ఆగ్రహం!

Nellore: నెల్లూరు బాలాజీ నగర్‌‌లోని సావిత్రీబాయి పూలే విగ్రహం వద్ద బీసీ సంఘాల నాయకులు భారీ నిరసన ప్రదర్శన చేపట్టారు. వైసీపీ హయాంలో బీసీ రిజర్వేషన్లకు కోత పెట్టారంటూ వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఈ నిరసన కార్యక్రమంలో భాగంగా బీసీ సెల్ అధ్యక్షులు కప్పిర శ్రీనివాసులుతో పాటు పలువురు ప్రముఖ బీసీ నేతలు సావిత్రీబాయి పూలే విగ్రహానికి పాలాభిషేకం చేసి, పూలమాలలు వేసి నివాళులర్పించారు. వైసీపీ హయాంలో బీసీ రిజర్వేషన్లను కుదించి ఏకంగా 16,800 మంది బీసీల రాజకీయ అవకాశాలను దెబ్బతీశారని బీసీ నేతలు మండిపడ్డారు.

బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు రాకుండా కుట్రపూరితంగా వ్యవహరించి కోర్టులకు వెళ్లిన చరిత్ర వైసీపీది అని, ఆ పార్టీ నిజమైన 'బీసీ ద్రోహి' అంటూ నినాదాలు చేశారు. బీసీల ఉసురు తగిలి వైసీపీ రాజకీయంగా పూర్తిగా తుడిచిపెట్టుకుపోవడం తథ్యమని హెచ్చరించారు.

రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలంతా ఏకమై కూటమి అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపిస్తామని బీసీ నేతలు స్పష్టం చేశారు. రాబోయే ఎన్నికల్లో కూటమి సాధించే విజయం.. వైసీపీ చేసిన బీసీ ద్రోహానికి చెంపపెట్టులా ఉండబోతోందని వారు తీవ్రంగా హెచ్చరించారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.