Nellore: నెల్లూరు కమిషనర్‌కు బీజేపీ నేతల స్ట్రాంగ్ కౌంటర్

Nellore: నెల్లూరు మున్సిపల్ కమిషనర్ వ్యాఖ్యలపై బీజేపీ నేతలు ఆగ్రహం. కేవలం బీజేపీ కార్యాలయాన్ని టార్గెట్ చేయడంపై విమర్శలు.

V. Narasimhulu, Nellore
Published on: 14 May 2026 9:56 PM IST
Nellore
X

Nellore: నెల్లూరు కమిషనర్‌కు బీజేపీ నేతల స్ట్రాంగ్ కౌంటర్

Nellore: నెల్లూరులోని భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు శీపారెడ్డి వంశీధర్ రెడ్డి అధ్యక్షతన జరిగిన మీడియా సమావేశం లో మాట్లాడుతూ.. నిన్న మున్సిపల్ కమిషనర్ ప్రెస్ లో మాట్లాడుతూ పిడబ్ల్యుడి కెనాల్ మీద ఉన్న భారతీయ జనతా పార్టీ కార్యాలయం ఉన్నదని, దాన్ని తొలగించామని చెప్పడం జరిగింది. పిడబ్ల్యుడి కెనాన్ మీద ఒక్క బీజేపీ ఆఫీస్ మాత్రమే ఉందా నెల్లూరు నగరంలో అనేకమంది ఆక్రమించి పెద్ద పెద్ద నిర్మాణాలు నిర్మించారని,

వాటన్నిటి జోలికి పోకుండా ఒక్క బీజేపీ ఆఫీస్ మాత్రమే అర్ధరాత్రి ఎవరికీ చెప్పకుండా కలిగించేసామని చెప్పటం ఏదైతే ఉందో కరెక్ట్ కాదని తెలియజేశారు. మీరంతా నిజాయితీగా పని చేస్తుంటే పిడబ్ల్యుడి కెనాల్ మీద ఉండే అన్ని నిర్మాణాలను తొలగించాలని తొలగించాలని మా బిజెపి కార్యాలయం 35 సంవత్సరాలుగా నడుస్తుందని అదే ఏరియాలో ఎన్నో ఆక్రమణలు మీకు కనపడలేదా ఒక వ్యక్తి నీకు అర్జీ ఇచ్చాడని ఎటువంటి విచారణ జరుపకుండా చేయికి ఎంతవరకు సమంజసం అని అలాగే నెల్లూరు నగర ప్రజలు మేము ఇచ్చిన అర్జీలు అన్ని ఇలానే మీరు పరిష్కరించ గలిగారా అని తెలియజేశారు.

అలాగే మీరు మతాల గురించి కులాల గురించి బిజెపి వారు మాట్లాడారు అని ప్రశ్నకు తెలియజేశారు. మేం ఎక్కడ కులాల గురించి మతాల గురించి మాట్లాడలేదని మీరు మా పార్టీ వాళ్ళని హేళనగా మీరు దేశభక్తులా అని అనడం ఎంతవరకు సమంజసం అని అన్నారు. తర్వాత ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షులు డి ఎస్ పరశురాం మాట్లాడుతూ కమిషన్ ని మా పార్టీ నాయకులు ఎప్పుడు కులం పేరుతో దూషించలేదని, అలాంటి దూషించే సంస్కృతి మా పార్టీకి వారికి లేదని ఆయనే తన కులాన్ని చెప్పుకొని పై అధికారుల మెప్పు పొందే దానికోసం చేస్తున్నారా,

లేదా మాకు హెచ్చరికలు జారీ చేస్తున్నారా, తెలియజేశారు. ఓబీసీ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడ్డం విజయ్ కుమార్ మాట్లాడుతూ 2025 నుంచి ఇంచార్జ్ కమిషనర్ కమిషనర్ గా వ్యవహరిస్తున్నారని ఎక్కడైనా ఇంచార్జ్ కమిషనర్ ఒక నెల రోజులు లేదా కొద్ది రోజులు మాత్రమే ఉంటారని ఇతను ఎవరికి లబ్ధి చేకూర్చున్నారో అలాగే ఒక మున్సిపల్ కమిషనర్ ఐఏఎస్ అధికారి ఉండాలని రాష్ట్రంలో ఐఏఎస్ అధికారులకు కొదువున్నదా, ప్రభుత్వానికి తెలియజేస్తే ఐఏఎస్ అధికారులను రాష్ట్ర ప్రభుత్వానికి పంపిస్తుంది అని,

అలాగే మే నెలలో ఒక్క మొక్క నాటే దానికి 12,000 రూపాయలు ఖర్చు చేశారని మేము అడుగుతున్నాము, మీరు ఏం మొక్కలు నాటారు వాటి ఆలనా పాలన ఏమిటి తెలియజేయాలి, వి ఆర్ హై స్కూల్ ఓపెనింగ్ అప్పుడు హైరర్స్ కు అయిన ఖర్చు 56 లక్షల రూపాయలు, ఏమి షామినాలేశారు , గుడ్డలతో వేశారా బంగారంతో తివాచీలు వేశారా? ఇది ప్రజలకు తెలియజేయాల్సిన బాధ్యత మీకు ఉన్నది అన్నారు. రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు భరత్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ నెల్లూరు నగర కార్పొరేషన్ లో ఏం జరుగుతుందని అత్యంత అవినీతి జరుగుతుందని.

అలాగే గతంలో ప్రెస్ మీట్ పెట్టి ఎవరెవరు ఎంత డబ్బులు డ్రా చేసుకున్నారు అని, పెట్టుకున్నారని చరిత్ర కూడా ఉన్నది. ఈ నగరంలో వేసే లేఅవుట్లు కావచ్చు, కట్టే అపార్ట్మెంట్లు కావచ్చు అన్ని మీ అనుమతులలో లోబడి ఉన్నాయా, ఎంతెంత కమిషన్ ను పుచ్చుకున్నారు.. అని అందరికీ తెలుసని మీకు సూటిగా ప్రశ్నిస్తున్నాము. సవాల్ స్వీకరించి మీరు ప్రెస్ మీట్ పెడితే మేము మాట్లాడతాం అని మున్సిపల్ మంత్రి ఉన్న చోట ఐఏఎస్ అధికారి కాకుండా ఇన్చార్జి కమిషనర్ ని కమిషనర్ గా ఉంచటం ఎంతవరకు సమంజసం అని అన్నారు.

పై కార్యక్రమంలో యాకసిరీ ఫణి రాజు, మండ్ల ఈశ్వరయ్య, ఎరబోలు రాజేష్,యశ్వంత్ సింగ్,గుత్తా అశోక్ నాయుడు,లాల్ కాజా మస్తాన్,పీర్ సాహెబ్, నారాయణరెడ్డి,మన్నేటి శ్రీనివాసులు మరియు మీడియా ఇంచార్జ్ చిన్నారెడ్డి శ్రీనివాసులు రెడ్డి పాల్గొన్నారు.

V. Narasimhulu, Nellore

V. Narasimhulu, Nellore

Next Story