Nellore: దివ్యాంగుల సాధికారతకు బ్రహ్మకుమారీల ప్రత్యేక కార్యక్రమం
Nellore: ప్రభుత్వ సహకారంతో పాఠశాలలు, వసతి గృహాలలో దివ్యాంగుల సాధికారత, సమగ్రతపై బ్రహ్మకుమారీ సంస్థ ఆధ్వర్యంలో ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు.
Nellore: దివ్యాంగుల సాధికారతకు బ్రహ్మకుమారీల ప్రత్యేక కార్యక్రమం
నెల్లూరు: బ్రహ్మకుమారి ఈశ్వరియ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో ప్రభుత్వ సహకారంతో రాష్ట్రవ్యాప్తంగా కొన్ని పాఠశాలలు, వసతి గృహాలో దివ్యాంగుల సాధికారత, మరియు సమగ్రత, సమానత్వాన్ని తెలియజేయడం కోసం. ఈ కార్యక్రమాన్ని రూపొందించడం జరిగిందని బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయం, నెల్లూరు ఇన్చార్జ్ సిస్టర్ ప్రసన్న అన్నారు.
బుధవారం, వేదయపాలెం జిల్లా కార్యాలయం లో జరిగిన ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ ఈ ఏడాది ఆగస్టు. సెప్టెంబర్ మాసాలలో ఈ కార్యక్రమం రాష్ట్రవ్యాప్తంగా కొనసాగుతుందన్నారు . ఈ కార్యక్రమా నిర్వహణ కోసం బ్రహ్మకుమారి సిస్టర్స్ ప్రత్యేక శిక్షణ పొందినారని, ఆమె వివరించారు.
దివ్యాంగులకు వారి భాషలోనే బోధించడం జరుగుతుందన్నారు. విద్యార్థులలో ఏకాగ్రత, అంతర్గత గుణాలను. సద్గుణాలను పెంపొందించేందుకు కృషి చేస్తున్నామన్నారు. ప్రచారంలో అందుకు సంబంధించిన ఆటలు, చిత్రకళా ప్రదర్శన, పోస్టర్లు ప్రముఖ దివ్యాంగుల విజయాలను తెలియజేసే వీడియోలు స్ఫూర్తిదాయకమైన పాటలు.
కథలు వివరించడం జరుగుతుందన్నారు. ధ్యానం ద్వారా వారికి మనోధైర్యాన్ని కలిగేందుకు కృషి చేస్తున్నామన్నారు. బుధవారం కడప జిల్లా నుంచి నెల్లూరు జిల్లా బుచ్చికి యాత్ర చేరుకుంటుందని తదనంతరం జిల్లా కార్యాలయంలో కార్యక్రమాలను వివరించిన అనంతరం మొదటి రోజు మధ్యాహ్నం దర్గామిట్లలోని ప్రభుత్వ బాలికల వసతి గృహంలో కార్యక్రమం అనంతరం వికలాంగుల సంక్షేమం కోసం కృషి చేస్తున్న విఎన్ఈ హోమ్ లో కార్యక్రమం ఉంటుందన్నారు.
గురువారం ఉదయం స్వర్ణ దీపం ట్రస్టులో తదుపరి ప్రగతి చారిటబుల్ ట్రస్ట్ లో అనంతరం వెంకటాచలం సి ఆర్ సి స్కూల్లో కార్యక్రమాలు ఉంటాయన్నారు. అనంతరం తిరుపతి జిల్లాకు యాత్ర వెళుతుందని ఆమె అన్నారు. ఈ కార్యక్రమంలో రాజస్థాన్ నుండి వచ్చిన సూర్య ప్రకాష్ రావు, సిస్టర్ ఛాయా, బెంగళూరు, బికె.షీలా సిస్టర్, విడవలూరు. సీనియర్ జర్నలిస్ట్ జయప్రకాష్. వీఎన్ హోమ్ ఇంచార్జ్ సిస్టర్ రూబీ, స్వర్ణ దీపం నిర్వాహకురాలు ఉమామహేశ్వరి ఇతర ప్రముఖులు పాల్గొన్నారు.




