Nellore: బుచ్చిరెడ్డిపాళెంలో కూటమి విజయం ఖాయం: ఎంపీ వేమిరెడ్డి!
Nellore: బుచ్చిరెడ్డిపాళెం మున్సిపల్ ఎన్నికల్లో కూటమి చైర్‌పర్సన్ అభ్యర్థి దొడ్ల విజయలక్ష్మి, 28 మంది కౌన్సిలర్లను గెలిపించాలని ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి పిలుపునిచ్చారు.
Nellore: బుచ్చిరెడ్డిపాళెంలో కూటమి విజయం ఖాయం: ఎంపీ వేమిరెడ్డి!
నెల్లూరు: బుచ్చిరెడ్డిపాళెం మున్సిపాలిటీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థులందరినీ గెలిపించి 100 శాతం విజయం సాధించాలని నెల్లూరు పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి ప్రజలకు పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు మరింత ఉత్సాహంగా కొనసాగాలంటే స్థానిక ఎన్నికల్లోనూ కూటమి అభ్యర్థులకు ప్రజలు అండగా నిలవాలని కోరారు. మున్సిపల్ చైర్‌పర్సన్ అభ్యర్థి దొడ్ల విజయలక్ష్మితో పాటు 28 మంది కౌన్సిలర్ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.
కూటమి ప్రభుత్వ పాలనలో ప్రజలు ప్రశాంతంగా, ఆనందంగా ఉన్నారని ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి పేర్కొన్నారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా అభివృద్ధి, సంక్షేమాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. బుచ్చిరెడ్డిపాళెం మున్సిపాలిటీని మరింత అభివృద్ధి పథంలో నడిపించేందుకు కూటమి అభ్యర్థులకు ప్రజల మద్దతు అవసరమన్నారు.
"ప్రజల ఆదరణతో విజయమే లక్ష్యంగా భారీ రోడ్ షో"
కోవూరు శాసనసభ్యులు వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి ఆధ్వర్యంలో బుచ్చిరెడ్డిపాళెంలో భారీ రోడ్ షో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డితో పాటు వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్, టీడీపీ జిల్లా అధ్యక్షులు, ఎమ్మెల్సీ బీద రవిచంద్ర పాల్గొన్నారు. రోడ్ షోకు పెద్ద ఎత్తున తరలివచ్చిన ప్రజలను ఉద్దేశించి ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి ప్రసంగించారు. ప్రజల నుంచి లభిస్తున్న ఆదరణ చూస్తుంటే ఇది ఎన్నికల ప్రచార సభలా కాకుండా విజయోత్సవ యాత్రలా కనిపిస్తోందన్నారు. ప్రజల మద్దతును ఓట్ల రూపంలోకి మార్చుకుని చైర్‌పర్సన్ అభ్యర్థితో పాటు 28 మంది కూటమి కౌన్సిలర్ అభ్యర్థులను గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు.
"దొడ్ల విజయలక్ష్మికి మద్దతు ఇవ్వండి"
ఎన్నో వ్యాపారాలు ఉన్నప్పటికీ ప్రజలకు సేవ చేయాలనే సంకల్పంతో దొడ్ల కుటుంబం నుంచి వచ్చిన బుచ్చిరెడ్డిపాళెం మున్సిపల్ చైర్‌పర్సన్ అభ్యర్థి దొడ్ల విజయలక్ష్మి ని ప్రజలు ఆదరించాలని ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కోరారు. ప్రజా సేవ పట్ల నిబద్ధతతో ముందుకు వస్తున్న ఆమెను భారీ మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.
గత రెండున్నరేళ్లలో కూటమి ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రతి ఇంటికీ చేరవేయాలని పార్టీ నాయకులు, కార్యకర్తలకు సూచించారు. ప్రభుత్వ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాల గురించి ప్రజలకు వివరించి, కూటమి అభ్యర్థుల విజయానికి సమష్టిగా కృషి చేయాలని కోరారు.
"28 మంది కూటమి అభ్యర్థుల విజయమే లక్ష్యం"
అనంతరం బుచ్చిరెడ్డిపాళెం మున్సిపల్ చైర్‌పర్సన్ అభ్యర్థి దొడ్ల విజయలక్ష్మి మాట్లాడుతూ.. మున్సిపల్ ఎన్నికల్లో తాను, 28 మంది కూటమి కౌన్సిలర్ అభ్యర్థులు విజయం సాధిస్తామనే విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. బుచ్చిరెడ్డిపాళెం ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి నాయకత్వానికి, ప్రజల ఆదరణకు తమ విజయం ప్రతీకగా నిలుస్తుందన్నారు. ప్రజల మద్దతుతో భారీ మెజారిటీతో విజయం సాధించి.. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి, వీపీఆర్ దంపతులకు బుచ్చిరెడ్డిపాళెం మున్సిపాలిటీని విజయ కానుక అందిస్తామని తెలిపారు.




