Nellore: నెల్లూరు ఆచార్య బొడ్డుపల్లి పురుషోత్తం శతజయంతి

Nellore: నెల్లూరులో ఈనెల 17న ఆచార్య బొడ్డుపల్లి పురుషోత్తం శతజయంతి వేడుకలు. ఆయన పేరుతో ప్రత్యేక వెబ్సైట్ ఆవిష్కరణ. బహుముఖ ప్రజ్ఞాశాలికి ఘన నివాళి.

V. Narasimhulu, Nellore
Published on: 14 July 2026 8:03 PM IST
Nellore
X

Nellore: నెల్లూరు ఆచార్య బొడ్డుపల్లి పురుషోత్తం శతజయంతి

నెల్లూరు: నెల్లూరు కి చెందిన ప్రముఖ వ్యాకరణ వేత్త, భాషా శాస్త్రజ్ఞుడు, నవలా రచయిత,నాటికానిర్మాత,శతకకర్త,పద్యకవి, అనువాద కర్త బొడ్డుపల్లి పురుషోత్తం శతజయంతి వేడుకలకు నెల్లూరు పుర మందిరం సిద్ధమవుతోంది.ఆచార్య బొడ్డుపల్లి పురుషోత్తం గారి శతజయంతి వేడుకను ఈనెల 17న శుక్రవారం సాయంత్రం 6 గంటలకు నెల్లూరు టౌనుహాలు చిన్నరూమ్ లో నిర్వహిస్తున్నామని చెప్పారు.

ఆచార్య పురుషోత్తం సాంస్కృతిక భాషా పండితుడిగా బహుభాషాలను అనువాదకుడిగా సాహిత్య సేవలందించినట్లు ఆయన కుమార్తె డాక్టర్ గిరిజాలక్ష్మి తెలిపారు.డాక్టర్ పురుషోత్తం వందేళ్ళ సందర్భంగా ప్రత్యేక సాహిత్య సాంస్కృతిక భాష వేదికలను నిర్వహిస్తున్నట్లు ఆయన కుమార్తె డాక్టర్ గిరిజాలక్ష్మి తెలిపారు. బహుముఖీనమైన తమ ప్రజ్ఞతో 30 గ్రంథాలను ప్రచురించారు.పురుషోత్తం మార్గదర్శకత్వంలో 40మంది ఎమ్.ఫిల్.,పిహెచ్.డి.లను పొందారు.జాతీయాచార్యులుగా యు.జి.సి వారి గుర్తింపు తెచ్చుకున్నారు.

బోర్డు స్కూలు టీచరుగా తమ జీవన ప్రస్థానాన్ని ఆరంభించి విశ్వవిద్యాలయ ఆచార్యులుగా ఎదిగిన స్వయంకృషీవలులు.పురుషోత్తం శతజయంతి వేడుకలకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు గిరిజ లక్ష్మి తెలిపారు.తన తండ్రి పురుషోత్తం ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో ఆచార్య వర్యులుగా, తెలుగు ప్రాచ్య శాఖాధ్యక్షులుగా పనిచేశారని చెప్పారు.ఆయన పురుషోత్తం శతజయంతి వేడుకల సందర్భంగా ఆయన పేరుతో వెబ్సైట్ ను ఆవిష్కరించి, వారి గ్రంథాలను ప్రపంచl వ్యాప్తంగా అందరూ వినియోగించుకునే ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు.

V. Narasimhulu, Nellore

V. Narasimhulu, Nellore

Next Story