Nellore: ఇంటి తాళం ఎక్కడ పెడుతున్నారో చూసి స్కెచ్: నెల్లూరులో భారీ చోరీ కేసును ఛేదించిన చిన్న బజార్ పోలీసులు!
నెల్లూరు సిటీ చిన్న బజార్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన భారీ దొంగతనం కేసును పోలీసులు ఛేదించారు.
Nellore: ఇంటి తాళం ఎక్కడ పెడుతున్నారో చూసి స్కెచ్: నెల్లూరులో భారీ చోరీ కేసును ఛేదించిన చిన్న బజార్ పోలీసులు!
పలు కేసుల్లో నేరస్థులైన ముద్దాయిలను మీడియా ముందు హాజరు పరిచారు చిన్న బజార్ పోలీస్ స్టేషన్ లో... ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో పోలీసులు మాట్లాడుతూ కేసు వివరాలు వెల్లడించారు.
నేర సంఖ్య మరియు చట్ట విభాగం:
Cr.No. 108/26 u/sec. 305 (a) BNS
నేరం జరిగిన ప్రదేశం:
డోర్ నెం.22/351, ఓల్డ్ పెన్షన్ లైన్, కుండల దర్గా సమీపంలో, కుమ్మరి వీధి, డైకస్ రోడ్, పెద్ద బజార్, నెల్లూరు సిటీ.
నేరం జరిగిన సమయం:
తేది 02.06.2026 సాయంత్రం 05.30 గంటల నుండి 7.00 గంటలు.
ఫిర్యాది వివరాలు:
షేక్ అజ్మత్, భర్త పేరు షేక్ షఫీ, వయస్సు 38 సంవత్సరాలు, ముస్లిం, నివాసం డోర్ నెం.22/351, ఓల్డ్ పెన్షన్ లైన్, కుండల దర్గా సమీపంలో, కుమ్మరి వీధి, డైకస్ రోడ్, పెద్ద బజార్, నెల్లూరు సిటీ.
నేరస్తుల వివరాలు:
చట్టం తో సంఘర్షణ పడుతున్న బాలురు-2 మరియు షేక్ ఇర్ఫాన్ s/o అబ్దుల్ బషీర్, వయసు 19 సంవత్సరాలు, కులము ముస్లిం r/o డోర్ నెంబర్.20-4-379, 9 వ వీధి, మన్సూర్ నగర్, పరమేశ్వరి నగర్, నెల్లూరు సిటీ.
మొహమ్మద్ ఆబిద్ s/o మొహమ్మద్ అయ్యూబ్ ఖాన్, వయస్సు 20 సంవత్సరాలు, కులము. ముస్లిం r/o డోర్ నెంబర్. 22/532-A, హాలాలీం మసీదు వీధి, జండా వీధి, నెల్లూరు సిటీ.
కేసు వివరాలు : తేది 02.06.2026 న సాయంత్రం ఫిర్యాదుదారు షేక్ అజ్మత్ తన పిల్లలను ట్యూషన్ కు వదిలి, వాకింగ్ కు వెళ్లి , తిరిగి ఇంటికి రాగా, బెడ్రూమ్ లోని , బీరువా మరియు లాకర్ తెరవబడి ఉండటం గమనించింది. అనంతరం లాకర్ను పరిశీలించగా అందులో భద్రపరచి ఉంచిన బంగారు ఆభరణాలు కనిపించకపోవడంతో తన భర్తకు సమాచారం ఇచ్చింది. తన భర్త షేక్ షఫీ ఇంటికి తాళం వేసి వెళ్లేటప్పుడు అలవాటు ప్రకారం ఇంటి ముందు ఉన్న వాషింగ్ మిషన్ పై , తాళం ఉంచి వెళ్లినట్లు తెలిపాడు. ఈ అవకాశాన్ని ఉపయోగించుకున్న గుర్తు తెలియని వ్యక్తులు, ఇంటిలోకి ప్రవేశించి లాకర్లో భద్రపరచి ఉంచిన సుమారు 145.300 గ్రాముల బంగారు ఆభరణాలను దొంగిలించి వెళ్లినట్లు ఫిర్యాదు అందింది.
G.No.108/2026 u/sec.305(a) BNS ໐ నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. దర్యాప్తులో భాగంగా శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా గౌరవ ఎస్పీ డాక్టర్ అజితా వేజెండ్ల ఐ.పి.యస్ ఆదేశాల మేరకు మరియు నెల్లూరు టౌన్ SDPO దీక్షా ఐ.పి.యస్ సూచనల మేరకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టగా, తేది 09.06.2026 న రాత్రి 09.30 గంటలకు నెల్లూరు సిటీ, పెద్ద బజార్, డైకస్ రోడ్ సెంటర్లో లోని చేపల మార్కెట్ సమీపంలో ఇద్దరు చట్టంతో సంఘర్షణ పడుతున్న బాలులతో పాటు నిందితులు షేక్ ఇర్ఫాన్ మరియు మొహమ్మద్ ఆబిద్లను అదుపులోకి తీసుకొని విచారించారు. విచారణలో వారు నేరాన్ని ఒప్పుకోవడంతో వారి వద్ద నుండి చోరీకి గురైన మొత్తం సుమారు 145.300 గ్రాముల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకొని, నిందితులను అరెస్టు చేసి న్యాయస్థానం ముందు హాజరు పరచడం జరిగింది.
ఈ కేసును ఛేదించి ముద్దాయిలను అరెస్టు చేసిన చిన్న బజార్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ యస్. శ్రీనివాసరావుని, ఎస్ఐ ఎ. అయ్యప్పని మరియు వారి సిబ్బంది HC- 1857 జె. సురేష్ బాబు, HC-1723 క్రిష్ణయ్య HC-2086 సయ్యద్ నజ్మల్ హుస్సేన్, PC-110 ఎస్.వి. శ్యాంప్రసాద్, PC-2603 ఎం. సుబ్బారావు, PC-3014 5.໖.໖. 5, PC-2720 2.5. 5, PC-2762 షేక్ రసూల్ మరియు HG-549 పి. రామాంజనేయుల ను జిల్లా ఎస్పీ అజితా వేజెండ్ల మరియు SDPO అభినందించారు.




