Nellore: నెల్లూరు 21వ డివిజన్‌లో సచివాలయ సిబ్బంది సమన్వయ భేటీ!

Nellore: నెల్లూరు 21వ డివిజన్ కార్పొరేటర్ గునుకుల విజయలక్ష్మిని సచివాలయ సిబ్బంది కలిసి అభినందించారు. ప్రజలకు బాధ్యతతో సేవలు అందించాలని ఆమె సూచించారు.

A Praveen, Nellore
Published on: 10 Nov 2026 7:51 PM IST
Nellore
X

Nellore: నెల్లూరు 21వ డివిజన్‌లో సచివాలయ సిబ్బంది సమన్వయ భేటీ!

నెల్లూరు: ఈ సందర్భంగా జనసేన నాయకులు కిషోర్ గునుకుల మాట్లాడుతూ… జనసేన అధినేత, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఆకాంక్షించిన రాజకీయ జవాబుదారీతనం, పారదర్శకమైన పాలన, ప్రజలకు నేరుగా సేవలందించే నూతన రాజకీయ సంస్కృతికి అనుగుణంగా, పురపాలక శాఖ మంత్రి, నెల్లూరు నగర ఎమ్మెల్యే శ్రీ పొంగూరు నారాయణ గారి మార్గదర్శకత్వంలో సచివాలయ వ్యవస్థ ఎంతో నైపుణ్యంతో, బాధ్యతాయుతంగా పనిచేస్తూ ప్రజలకు మెరుగైన సేవలందిస్తోందని ప్రశంసించారు.

ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలకు చేరవేయడంలో సచివాలయ సిబ్బంది పాత్ర ఎంతో కీలకమని పేర్కొన్నారు. గతంలో కూడా సచివాలయ సిబ్బంది సహకారంతో అనేక ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేశామని, ఇప్పుడు ప్రజాప్రతినిధిగా బాధ్యతలు స్వీకరించిన గునుకుల విజయలక్ష్మి గారికి అభినందనలు తెలియజేయడంతో పాటు, భవిష్యత్తులో మరింత సమన్వయంతో ప్రజలకు సేవలందించాలనే ఉద్దేశంతో సిబ్బంది ఆమెను కలిశారని తెలిపారు.

ఈ సందర్భంగా కార్పొరేటర్ విజయలక్ష్మి గునుకుల మాట్లాడుతూ, ప్రజలు తమ సమస్యలతో సచివాలయానికి వచ్చినప్పుడు వారితో ఓపికగా, ప్రేమగా, గౌరవంగా వ్యవహరించాలని, చిన్న సమస్యనైనా నిర్లక్ష్యం చేయకుండా పరిష్కరించేందుకు చొరవ చూపాలని కోరారు. మనమందించే చిన్న సేవ కూడా ఒక కుటుంబ జీవితంలో గొప్ప మార్పును తీసుకురాగలదని, ప్రజా సంక్షేమమే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ తమ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించాలని సూచించారు.

మంత్రి శ్రీ పొంగూరు నారాయణ గారి అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు చేరవేసే విషయంలో సచివాలయ సిబ్బందికి పూర్తి సహకారం అందిస్తానని, ప్రతి విభాగంలోనూ ప్రజలకు మెరుగైన సేవలందించేందుకు తన వంతు బాధ్యతను నిర్వర్తిస్తానని విజయలక్ష్మి గునుకుల తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు కిషోర్ గునుకుల, ప్రశాంత్ గౌడ్,తెలుగుదేశం నాయకులు చండ్రా మదు పాల్గొన్నారు.

A Praveen, Nellore

A Praveen, Nellore