Nellore: నెల్లూరులో ఎస్.ఐ.ఆర్ ఎలక్టోరల్ రోల్స్ 2026 పై సమీక్ష!

Nellore: నెల్లూరు నగర నియోజకవర్గంలో ఎస్.ఐ.ఆర్ (SIR) ఎలక్టోరల్ రోల్స్ - 2026 రెండవ దశ సవరణ ప్రక్రియపై ఈఆర్వో వై.ఓ. నందన్ ఆధ్వర్యంలో సమీక్షా సమావేశం జరిగింది.

U.L. NARASIMHULU, NELLORE
Published on: 18 Aug 2026 5:46 PM IST
Nellore
X

Nellore: నెల్లూరులో ఎస్.ఐ.ఆర్ ఎలక్టోరల్ రోల్స్ 2026 పై సమీక్ష!

నెల్లూరు: నెల్లూరు నగర నియోజకవర్గం - 117 ఈ.ఆర్.ఓ ( ఎలెక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ ) వై.ఓ నందన్ నెల్లూరు నగరపాలక సంస్థ కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ సెంటర్ విభాగంలో ఎన్నికల ఏ.ఈ.ఆర్.ఓ లు, సూపర్వైజర్ లు, బి.ఎల్.ఓ లతో ఎస్.ఐ.ఆర్ ఎలెక్టోరల్ రోల్స్ - 2026 అంశంపై మంగళవారం సమీక్షను నిర్వహించారు.

ఎస్.ఐ.ఆర్ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్) రెండవ దశ నిర్వహణలో క్షేత్ర స్థాయిలో వివిధ అంశాలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరణలను అందజేశారు.

అనంతరం ఈ.ఆర్.ఓ మాట్లాడుతూ సెప్టెంబర్ నెల 28 వ తేదీ వరకు నిర్వహించనున్న రెండవ దశ ఓటరు జాబితా రూపకల్పనలో మొదటి జాబితాలో ఓటు నమోదు కాని వారికి నోటీసులు అందజేసి, వారి నుంచి ప్రభుత్వం నిర్దేశించిన 12 రకాల ధృవీకరణ పత్రాలలో ఏవైనా స్వీకరించి యాప్ లో నమోదు చేయాలని తెలిపారు.

ఎన్నికల సంఘం నిర్దేశించిన అన్ని మార్గదర్శకాలను పాటిస్తూ అర్హులైన ప్రతిఒక్కరికీ ఓటు హక్కు కల్పించేందుకు కృషి చేయాలని సూచించారు. ఈ సమావేశంలో ఏ.ఈ.ఆర్.ఓ హమీద్, ఈ.డి.టి ఆనందరావు, సిబ్బంది పాల్గొన్నారు.

U.L. NARASIMHULU, NELLORE

U.L. NARASIMHULU, NELLORE

Next Story