Nellore: రామపురంలో సీఎం చంద్రబాబు, పవన్ కళ్యాణ్ పర్యటన ఏర్పాట్లు
Nellore: నెల్లూరు జిల్లా రామపురంలో ఈ నెల 29న సీఎం చంద్రబాబు, పవన్ కళ్యాణ్ పర్యటన. ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్ హిమాన్షు శుక్లా, ఎమ్మెల్యే కాకర్ల సురేష్.
Nellore: రామపురంలో సీఎం చంద్రబాబు, పవన్ కళ్యాణ్ పర్యటన ఏర్పాట్లు
నెల్లూరు: నెల్లూరు జిల్లా వరికుంటపాడు మండలంలో ఈ నెల 29వ తేదీన పల్లె పండుగ కార్యక్రమంలో భాగంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటించనున్న నేపథ్యంలో అధికారులు ఏర్పాట్లను ముమ్మరం చేశారు. సీఎం, డిప్యూటీ సీఎం పర్యటనలో భాగంగా రామాపురంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించిన ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా, ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ పరిశీలించారు.
రామాపురంలో సభా ప్రాంగణం, వేదిక, ప్రజలు కూర్చునే ప్రాంతాలు, పార్కింగ్, తాగునీరు, విద్యుత్, పారిశుద్ధ్యం తదితర ఏర్పాట్లపై అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు.
ముఖ్యమంత్రి పర్యటనకు పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరయ్యే అవకాశం ఉన్నందున ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లను నిర్ణీత సమయానికి పూర్తి చేసి, పర్యటన విజయవంతంగా జరిగేలా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్, ఎమ్మెల్యే సూచించారు.




