Nellore: నెల్లూరు జిల్లాలో ఓటర్ల జాబితా సవరణ షెడ్యూల్ విడుదల
Nellore: నెల్లూరు జిల్లాలో జనగణన ఎన్యూమరేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలని కలెక్టర్ హిమాన్షు శుక్లా అధికారులను ఆదేశించారు.
Nellore: నెల్లూరు జిల్లాలో ఓటర్ల జాబితా సవరణ షెడ్యూల్ విడుదల
Nellore: సెన్సెస్ ఎన్యూమరేషన్ చివరి దశకు వచ్చినందున సంబంధిత సిబ్బంది జాగ్రత్త వహించి జన గణన సక్రమంగా చేయాలని సూచించారు జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా. అదేవిధంగా ఎలాక్టోరోల్ ప్రక్రియలో సంబంధింత ఏఈఆర్వోలు ఈఆర్వోలు నిర్దేశిత గడువు లోపల ఎలక్ట్రోల్ సమగ్ర రివిజన్ ను పూర్తి చేయాలని కోరారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలో చేపట్టిన జనగణన కార్యక్రమాన్ని కచ్చితత్వంతో, పారదర్శకంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా సంబంధిత అధికారులకు సూచించారు.
బుధవారం జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా నెల్లూరు మున్సిపాలిటీ పరిధిలోని 27 వార్డు, ఆమంచర్ల, పొదలకూరు లోని విజ్ఞేశ్వరపురం - 2 తదితర ప్రాంతాలలో పర్యటించి క్షేత్రస్థాయిలో జన గణన మరియు ఓటర్ల జాబితా సమగ్ర సవరణ కార్యక్రమాలను క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ...
జన గణన ప్రక్రియలో 2011 సంవత్సరంలో తీసిన జనగణన కన్నా నేడు కొన్ని ప్రాంతాలలో జనాభా లెక్కల లో తేడా వచ్చిందని దాన్ని సవరించే విధంగా తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా సూచించడం జరిగింది అన్నారు. గణన జరిగేటప్పుడు కొంతమంది ఇంటికి తాళం వేసి ఉండడం లేదా పనికి వెళ్లడం లేదా వలసపై ఉండడం అయిందని అటువంటి వాటిని మరలా పరిశీలించి సమగ్రంగా నివేదిక రూపొందించాలన్నారు. మూడు నాలుగు రోజులలో జనాభా సవరణ ప్రక్రియ పూర్తి కావాల్సి ఉందని ఆయన తెలిపారు.
అదేవిధంగా క్షేత్రస్థాయిలో సర్ ప్రోగ్రామ్ ని పరిశీలించడం జరిగిందని 2002 నాటి ఎలక్ట్రోరల్ రోల్ ను సవరించే విధంగా ప్రత్యేక డ్రైవలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు 15 జూన్ నుండి జూలై 14,2026 వరకు బూతులెవల్ ఆఫీసర్లు ఇంటింటికి వెళ్లి ఓటర్ల జాబితాను తయారు చేయడం జరుగుతుందని జూన్ 15 తర్వాత ఒక నెలరోజుల పాటు జాబితాలో సవరణలకు గాని కొత్తవి పొందుపరచుటకు గాని అవకాశం ఏర్పడుతుందని అనంతరం తుది డ్రాఫ్ట్ జాబితాను సెప్టెంబర్ 22,2026 న ముద్రించడం జరుగుతుందన్నారు. అనంతరం పొదలకూరు బిట్-2 గ్రామ సచివాలయంలో సందర్శించి అక్కడ అందిస్తున్న సేవలు గురించి మరియు ఇతర అంశంల గురించి చర్చించి ఎనీమిషన్ మరియు సర్ ప్రోగ్రాం పనులను పరిశీలించారు.
ఈ కార్య క్రమంలో రెవెన్యూ డివిజనల్ అధికారి నాగ అనూష, మండల రెవెన్యూ అధికారులు కృష్ణ ప్రసాద్, శివకృష్ణ మండల పరిషత్ అధికారులు ఎన్యూమరేషన్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.




