Nellore: ఒక నెల.. ఒక గ్రామం.. కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన కలెక్టర్
Nellore: నెల్లూరు జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా వెంకటాచలం మండలం పాలిచర్లపాడు గ్రామంలో క్షేత్రస్థాయి పర్యటన జరిపారు.
Nellore: ఒక నెల.. ఒక గ్రామం.. కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన కలెక్టర్
Nellore: నెల్లూరు జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా క్షేత్రస్థాయి పర్యటనలకు శ్రీకారం చుట్టారు. రాష్ట్ర ప్రభుత్వం సూచనల మేరకు ప్రజా సమస్యల సత్వర పరిష్కారానికి క్షేత్ర స్థాయిలో ఒక నెల ఒక గ్రామం నాలుగు పర్యాయాలు కార్యక్రమం లో భాగంగా ఇవాళ జిల్లా కలెక్టర్ శ్రీ హిమాన్షు శుక్లా వెంకటాచలం మండలం పాలిచర్లపాడులో పర్యటించారు. ఈ సందర్బంగా అక్కడ ఏర్పాటు చేసిన గ్రామ సభలో పాల్గొని ప్రజల నుండి వివిధ సమస్యల పై ఆర్జీలను స్వాకరించారు.
ఎక్కువ శాతం భూ రీ- సర్వే, చుక్కల భూములు, అడంగల్, పించనుకొరకు ధరకాస్తులు, తదితరములు రాగా వాటిని సంబందిత అధికారులకు అందిస్తూ వచ్చే వారం నిర్వహించే గ్రామ సభ లోపల సమస్యలను పరిష్కరించాలని సంబందిత అధికారులను ఆదేశించారు. పొలాల మధ్య దారి విషయమై..
జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా మాట్లాడుతూ..
ఇరు వర్గాలు పెద్దల సమక్షంలో సామరస్య ధోరణిలో సమస్యను పరిష్కరించుకోవాలని, అధికారుల సహాయం అవసరమైతే తప్పకుండా అధికారులు సాయం అందిస్తారన్నారు. గ్రామంలో ఇంకా ఏమైనా సమస్యలు ఉన్నట్లయితే గ్రామ పెద్దల సహకారంతో పరిష్కరించుకోవాలని సూచించారు.
ఈ కార్యక్రమములో రెవిన్యూ డివిజినల్ అధికారి నాగ అనూషా,మండల రెవిన్యూ అధికారి సారంగ పాణి, మండల అధివృద్ధి అధకారి కల్పన, మండల విద్యా శాఖాధికారి సుదీర్ మరియు వివిధ శాఖల అధికారులు పాల్గోన్నారు.




