Nellore: నెల్లూరు మున్సిపల్ కమిషనర్‌కు కలెక్టర్ ‘షోకాజ్’ నోటీస్!
Nellore: నెల్లూరు మున్సిపల్ కమిషనర్ వై.ఓ నందన్‌కు జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా షోకాజ్ నోటీసులు జారీ చేశారు.
Nellore: నెల్లూరు మున్సిపల్ కమిషనర్‌కు కలెక్టర్ ‘షోకాజ్’ నోటీస్!
Nellore: నెల్లూరు మున్సిపల్ కమిషనర్ వై ఓ నందన్ కు జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా షోకాస్ నోటీసులు జారీ చేసారు. బిఎల్ఓ ల సమావేశంలో ఎన్నికల నిబంధనల ప్రకారం ఏ రాజకీయ పార్టీ కి సంబంధించిన నాయకులు ఉండకూడదన్న ఎన్నికల నిబంధనలను పక్కన పెట్టి కమిషినర్ నందన్ రాష్ట్ర పురపాలకశాఖ మంత్రి ని బిఎల్ఓ సమావేశంలో కూర్చొని పెట్టి సమావేశం నిర్వహించారని అంటే ఈ వ్యవహారం ఓ పార్టీ కి అనుకూలంగా ఉందంటూ ఎమ్మెల్సీ, నెల్లూరు నగర వైసీపీ ఇంచార్జ్ పర్వత రెడ్డి చంద్ర శేఖర్ రెడ్డి ఎలక్షన్ కమిషినర్ కు ఫిర్యాదు చేశారు.
దింతో పాటు జిల్లా కలెక్టర్ కు ఇటీవల కాలంలో మంత్రి నారాయణ బిఎల్ఓ సమావేశంలో పాల్గొన్న, వీడియోలను ఫోటోలను జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదులు పేర్కొన్నారు. దింతో పాటూ నెల్లూరు నగరంలో బిఎల్ఓ సర్ ఫారంను ఫిలిప్ చేసే విధానం సక్రమంగా తెలియకపోవడంతో ఎన్నికల కమిషినర్ రాజకీయ పార్టీల సహాయం తీసుకోమని చెబితే ప్రస్తుతం నెల్లూరు నగరం మొత్తం టీడీపీ నేతల కనుసన్నల్లోనే జరుగుతుందని ఆరోపణలు ఉన్నాయి.
బిఎల్ఓలో గత కొంతకాలంగా ఈ వ్యవహారాలకు పాల్పడుతున్నారని సోషల్ మీడియాలో ప్రధాన మీడియాలో ఆధారాలతో సహా చక్కర్లు కొట్టడంతో జిల్లా ఎన్నికల అధికారిగా జరుగుతున్న వ్యవహారంపై జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా సీరియస్ అయ్యారు . ఈ నేపథ్యంలో ఎన్నికల కమిషిన్ కు ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ఫిర్యాదు చేసిన నేపథ్యంలో ముందస్తు నోటీసులు కమీషనర్ కి ఇచ్చినట్టు తెలుస్తుంది . దింతో రాబోయే రోజుల్లో సర్ కార్యక్రమం మరింత వేగవంతంగా జరిగే అవకాశాలు ఉన్నాయి . ఇక నుంచి అత్యంత పారదర్శకంగా ఈ కార్యక్రమం జరగనుంది.




