Nellore: సీఎం చంద్రబాబు మెచ్చిన ‘పల్లె వీక్షణ’.. రాపూరు గోనుపల్లిలో గ్రామస్తులతో ముఖాముఖి మాట్లాడిన నెల్లూరు కలెక్టర్!

Nellore: నెల్లూరు జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా చేపట్టిన "పల్లె వీక్షణ" కార్యక్రమం రాపూరు మండలం గోనుపల్లిలో కొనసాగింది.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 21 May 2026 11:50 AM IST
Nellore
X

Nellore: సీఎం చంద్రబాబు మెచ్చిన ‘పల్లె వీక్షణ’.. రాపూరు గోనుపల్లిలో గ్రామస్తులతో ముఖాముఖి మాట్లాడిన నెల్లూరు కలెక్టర్!

రాపూరు (నెల్లూరు జిల్లా): పల్లె వీక్షణ కార్యక్రమంలో భాగంగా రాపూరు మండలం గోనుపల్లిలో, రామకూరు ఊర చెరువు వద్ద ఎంజీఎన్ఆర్ఇజిఎస్( Vika,sit Bharath Gram) పనులను స్థానిక శాసనసభ్యులు కురుగొండ్ల రామకృష్ణతో కలిసి పరిశీలించారు జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా.

నెల్లూరు జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా చేపట్టిన "పల్లి వీక్షణ" కార్యక్రమం ఇటీవల రాష్ట్ర కలెక్టర్ల సదస్సులోనూ, మొన్న కావలి నియోజకవర్గం పరిధిలోని తుమ్మలపెంటలో జరిగిన మత్స్యకారుల సేవలో కార్యక్రమంలోనూ... ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రత్యేకంగా ప్రస్తావించారు... ఇలాంటి కార్యక్రమాలు రాష్ట్రస్థాయిలో జరగాలంటూ ఆయన కలెక్టర్లకు సూచించారు.. స్ఫూర్తిదాయకమైన కార్యక్రమాన్ని పల్లె వాసుల యధార్థ జీవన స్థితిగతులు, సమస్యలను, జిల్లా ఉన్నతాధికారులు తెలుసుకోవచ్చు అని ఆయన అన్నారు.. ఇప్పటికే జిల్లాలో దాదాపు 8 మండలాలలో పర్యవేక్షణ కార్యక్రమాన్ని నిర్వహించిన కలెక్టర్ హిమాన్షు శుక్లా, తాజాగా రాపూరు మండలం గోనుపల్లి లో వెంకటగిరి ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ తో కలిసి ఉపాధి హామీ పనులను ఇవాళ ఉదయం పరిశీలించారు... అక్కడ గ్రామస్తులతో కలిసి వారి సమస్యలను తెలుసుకున్నారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story