Nellore: ఇంటింటికీ కలెక్టర్.. నెల్లూరులో ఎన్టీఆర్ భరోసా పంపిణీ!

Nellore: నెల్లూరులో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా. లబ్ధిదారుల ఇంటికి వెళ్లి స్వయంగా పెన్షన్లు అందజేత.

V. Narasimhulu, Nellore
Published on: 2 Jun 2026 9:32 AM IST
Nellore
X

Nellore: ఇంటింటికీ కలెక్టర్.. నెల్లూరులో ఎన్టీఆర్ భరోసా పంపిణీ!

Nellore: రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఎన్‌టీఆర్ భరోసా పింఛన్ పథకం సామాజిక భద్రతను బలోపేతం చేయడంలో కీలక పాత్ర పోషిస్తోందని నెల్లూరు జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్ల పేర్కొన్నారు.

సోమవారం నెల్లూరు నగర కార్పొరేషన్ పరిధిలోని 42వ డివిజన్‌, అమీన్ నగర్ లో నిర్వహించిన పింఛన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్, లబ్ధిదారుల నివాసాల వద్దకు వెళ్లి స్వయంగా పింఛన్లు అందజేశారు.

ఈ సందర్భంగా వితంతు పింఛన్ల కింద జి. రవణమ్మకు, ఎస్.కె. పర్వీన్ కి ఒక్కొక్కరికి రూ.4,000/- చొప్పున, అలాగే బెడ్ రిడెన్ పింఛన్ కింద ఎస్.డి. గౌస్ అహ్మద్‌కు రూ.15,000/-ను జిల్లా కలెక్టర్ అందజేశారు.

అనంతరం కలెక్టర్ లబ్ధిదారులతో ముచ్చటించి వారి కుటుంబ పరిస్థితులు, అవసరాలను తెలుసుకున్నారు. ప్రజలకు అందుతున్న సంక్షేమ పథకాల అమలుపై ఆరా తీసి, అర్హులైన ప్రతి ఒక్కరూ ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల ప్రయోజనాలను పొందేలా అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు.

సామాజిక భద్రత కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం పింఛన్ పథకాలను సమర్థవంతంగా అమలు చేస్తోందని, ఈ పథకాలు వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, ఇతర అర్హుల జీవనోపాధికి ఆసరాగా నిలుస్తున్నాయని కలెక్టర్ తెలిపారు.

ఈ కార్యక్రమంలో సచివాలయ సిబ్బంది, తదితరులు తదితరులు పాల్గొన్నారు.

V. Narasimhulu, Nellore

V. Narasimhulu, Nellore

Next Story