Nellore: ఆందోళన వద్దు.. ఆత్మవిశ్వాసంతో పరీక్ష రాయండి.. కలెక్టర్
Nellore: నెల్లూరు నగరంలోని నీట్–2026 రీ-ఎగ్జామినేషన్ పరీక్షా కేంద్రాలను జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా ఆకస్మికంగా తనిఖీ చేశారు.
Nellore: ఆందోళన వద్దు.. ఆత్మవిశ్వాసంతో పరీక్ష రాయండి.. కలెక్టర్
Nellore: ఆదివారం నీట్–2026 రీ-ఎగ్జామినేషన్ సందర్భంగా నెల్లూరు నగరంలోని దర్గామిట్టలో గల డి.కె.డబ్ల్యూ. కాలేజ్ ఫర్ ఉమెన్ (ఏ), పొదలకూరు రోడ్ , డి.కె. ప్రభుత్వ జూనియర్ కళాశాల (బాలికలు), దర్గామిట్ట పరీక్షా కేంద్రాలను జిల్లా కలెక్టర్ తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా పరీక్షా కేంద్రాల్లో విద్యార్థులకు కల్పించిన సౌకర్యాలు, తాగునీటి ఏర్పాట్లు, విద్యుత్ సరఫరా, భద్రతా చర్యలు, వైద్య సదుపాయాలు తదితర అంశాలను పరిశీలించి అధికారులకు అవసరమైన సూచనలు చేశారు.
పరీక్షా కేంద్రం వద్ద కలెక్టర్ మాట్లాడుతూ, విద్యార్థులు విజయమే లక్ష్యంగా ముందుకు సాగుతూ ఆత్మవిశ్వాసంతో పరీక్ష రాసి ఉత్తమ ఫలితాలు సాధించాలని ఆకాంక్షించారు. ఎలాంటి ఆందోళనకు గురికాకుండా ప్రశాంతంగా పరీక్ష రాయాలని సూచిస్తూ విద్యార్థులకు ధైర్యం చెప్పారు.
అనంతరం పరీక్షకు హాజరైన విద్యార్థులతో నేరుగా ముచ్చటించిన కలెక్టర్, కష్టపడి చదివిన అంశాలపై దృష్టి సారించి అత్యుత్తమ ప్రతిభ కనబరచాలని సూచించారు. తమ సామర్థ్యాలపై నమ్మకం ఉంచుకుని పరీక్షను ధైర్యంగా ఎదుర్కోవాలని ప్రోత్సహించారు.
అదేవిధంగా పరీక్షా కేంద్రాలకు వచ్చిన విద్యార్థుల తల్లిదండ్రులతో కూడా మాట్లాడిన కలెక్టర్, పిల్లలపై అనవసర ఒత్తిడి తీసుకురాకుండా వారిని ప్రోత్సహించాలని సూచించారు. తల్లిదండ్రుల ప్రోత్సాహం, ప్రశాంత వాతావరణం విద్యార్థుల విజయానికి ఎంతగానో దోహదపడతాయని తెలిపారు.
ఈ సందర్భంగా మరోసారి విద్యార్థులకు “ఆల్ ది బెస్ట్” చెబుతూ వారి భవిష్యత్తు విజయవంతంగా ఉండాలని ఆకాంక్షించారు. పరీక్షల నిర్వహణలో పాల్గొంటున్న అధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేసి పరీక్షలను సజావుగా, పారదర్శకంగా నిర్వహించాలని ఆదేశించారు.
నీట్–2026 రీ-ఎగ్జామినేషన్‌ను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం అన్ని విధాలా ఏర్పాట్లు చేసినట్లు అధికారులు కలెక్టర్ కు తెలిపారు.




