Nellore: నెల్లూరు సిటీ పరిధిలో జూన్ 16 నుంచే ఓటర్ల ఇంటింటి సర్వే

Nellore: కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు నెల్లూరు సిటీ నియోజకవర్గం పరిధిలో ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ ప్రక్రియ ప్రారంభమైంది.

V. Narasimhulu, Nellore
Published on: 15 Jun 2026 9:05 PM IST
Nellore
X

Nellore: నెల్లూరు సిటీ పరిధిలో జూన్ 16 నుంచే ఓటర్ల ఇంటింటి సర్వే

Nellore: కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు నెల్లూరు నగరపాలక సంస్థ సిటీ నియోజకవర్గం పరిధిలోని బూత్ లెవెల్ ఏజెంట్ లు, ఎన్నికల సిబ్బంది సోమవారం నుంచి ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా (ఎస్.ఐ.ఆర్) పరిశీలనపై ఇంటింటికి తిరిగి సమాచారాన్ని సేకరిస్తారని, ప్రజలంతా వారికి సహకరించి ఓటరు జాబితాను పూర్తిస్థాయిలో సిద్ధం చేసేందుకు దోహదపడాలని కమిషనర్ వై.ఓ నందన్ ఆకాంక్షించారు.

కార్పొరేషన్ కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ సెంటర్ విభాగంలో కమిషనర్ / ఈ.ఆర్.ఓ వై.ఓ నందన్ ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహణ సందర్భంగా విలేకరులతో సోమవారం మాట్లాడారు.

ఈ సందర్భంగా ఈ.ఆర్.ఓ మాట్లాడుతూ..

బి.ఎల్.ఓ లు అందరూ తమ పరిధికి సంబంధించిన రెండు రకాల ఎన్యూమరేటర్ ఫారంలను అందుకుని ఇంటింటి సర్వేలో నేటి నుంచి పాల్గొంటున్నారని, నిర్దేశించిన ఫారంలను పూర్తి చేసి తిరిగి ఎన్నికల సిబ్బందికి సమర్పించాలని ప్రజలకు సూచించారు.

2025 ఓటర్ల జాబితాను అనుసరించి ఓటర్ల వద్ద ఉన్న ధ్రువీకరణ పత్రాలను అందజేసి ఓటరు గుర్తింపు కొనసాగించడం, అదేవిధంగా కుటుంబంలో 18 సంవత్సరాలు నిండిన పౌరులకు నూతన ఓటరుగా చేర్చడం, మరణించిన వ్యక్తులను ఓటరు జాబితా నుంచి తొలగించడం, శాశ్వతంగా స్థానికత నుంచి తరలిపోయిన వారిని ఓటర్ జాబితా నుంచి తొలగించడం, పేర్లలో మార్పులు, ఫోటోలో మార్పులు తదితర అంశాలను ఈ ప్రక్రియ ద్వారా చేపట్టనున్నట్లు ఈ.ఆర్.ఓ స్పష్టం చేశారు.

ఎస్.ఐ.ఆర్ ప్రక్రియ ద్వారా ఓటర్లను తొలగి తొలగించనున్నారు అన్నది కేవలం అపోహ మాత్రమేనని, పూర్తిస్థాయిలో ప్రణాళికాబద్ధమైన ఓటర్ల జాబితా రూపొందించేందుకు మాత్రమే ఈ ప్రక్రియను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రూపొందించి అమలు చేస్తున్నాయని ఈ.ఆర్.ఓ స్పష్టం చేశారు.

ఓటర్లకు సేవలు అందించేందుకు గాను నియోజకవర్గ స్థాయిలో ప్రత్యేక సహాయ కేంద్రం ఏర్పాటు చేశామని తెలిపారు. ఓటర్ నమోదు, సవరణ, తొలగింపు, ఓటరు జాబితా పరిశీలన తదితర అంశాలపై సమాచారం కోసం 1950 నెంబర్ ను సంప్రదించాలని సూచించారు.

V. Narasimhulu, Nellore

V. Narasimhulu, Nellore

Next Story