Nellore: మీ వివరాలను మీరే నమోదు చేసుకోండి.. నెల్లూరు కమిషనర్
Nellore: నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ వై.ఓ. నందన్ జనగణన-2027 షెడ్యూల్‌ను విడుదల చేశారు.
Nellore: మీ వివరాలను మీరే నమోదు చేసుకోండి.. నెల్లూరు కమిషనర్
Nellore: నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్, ప్రిన్సిపల్ సెన్సస్ ఆఫీసర్ వై.ఓ నందన్ జనగణన - 2027 అంశంపై మంగళవారం కార్యాలయంలోని కమీషనర్ చాంబర్లో విలేకరుల సమావేశం నిర్వహించి వివరాలను వెల్లడించారు.
నూతన ఆర్ధిక ప్రణాళికలు, సంస్కరణలు, విద్యా ఉపాధి కార్యక్రమాలు చేపట్టేందుకు దేశం, రాష్ట్రం, కార్పొరేషన్ ల పరిధిలో జనాభా గణన అత్యంత కీలకమని, దేశ ప్రజల జనభా వివరాలను పూర్తిస్థాయిలో తెలుసుకునేందుకు జనాభా గణన - 2027 కార్యక్రమాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా చేపట్టారని కమిషనర్ తెలిపారు.
జనగణన కార్యక్రమంలో భాగంగా ఏప్రిల్ నెల 16వ తేదీ నుంచి 30వ తేదీ వరకు జనగణనలో ప్రజలు స్వయంగా తమ వివరాలను నమోదు చేసుకోవచ్చని తెలియజేశారు.
విద్యావంతులు, ఇంటర్నెట్ పరిజ్ఞానం ఉన్న ప్రతి ఒక్కరు స్వీయ నమోదు జనాభా గణన కార్యక్రమంలో పాల్గొని తమ కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, సన్నిహితులు, తోటి వారికి కూడా వారి వివరాలను నమోదు చేసేందుకు సహకరించాలని కమిషనర్ సూచించారు.
se.census.gov.in వెబ్ లింక్ ద్వారా ప్రజలు స్వయంగా తమ పూర్తి వివరాలను జనాభా గణనలో నమోదు చేసుకోవచ్చని కమిషనర్ ప్రకటించారు.
నమోదు తర్వాత వచ్చిన ఎస్.ఈ.ఐ.డి నెంబర్ ను ఎన్యూమరేటర్ కు తప్పనిసరిగా ఇవ్వాలని సూచించారు. మే నెల 1 వ తేదీ నుంచి ఇంటింటికి జనాభా వివరాలను సేకరించడానికి వచ్చే సిబ్బందికి ప్రజలు పూర్తిస్థాయిలో సహకరించి తమ వివరాలను అందజేయాలని ఈ సందర్భంగా కమిషనర్ విజ్ఞప్తి చేశారు.




