Nellore: కాంట్రాక్ట్ ఉద్యోగుల రెగ్యులరైజేషన్ కోసం జేఏసీ పిలుపు
Nellore: నెల్లూరులో కాంట్రాక్ట్ ఉద్యోగుల జేఏసీ కీలక సమావేశం. రెగ్యులరైజేషన్, 100 శాతం గ్రాస్ శాలరీ కోసం ఐక్య ఉద్యమానికి పిలుపు.
Nellore: కాంట్రాక్ట్ ఉద్యోగుల రెగ్యులరైజేషన్ కోసం జేఏసీ పిలుపు
నెల్లూరు: కాంట్రాక్ట్ ఉద్యోగుల రెగ్యులరైజేషన్, 100 శాతం గ్రాస్ శాలరీ తదితర డిమాండ్ల సాధన కోసం ఐక్యంగా ఉద్యమించాలని నెల్లూరు జేఏసీ పిలుపునిచారు.
కాంట్రాక్ట్ ఉద్యోగుల భవిష్యత్తుకు రెగ్యులరైజేషన్ ఎంతో కీలకమని, తమకు లభించిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఐక్యంగా ముందుకు సాగాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. యూనియన్లు, పదవులు, అభిప్రాయాలు వేరైనా ఉద్యోగులందరి భవిష్యత్తు, డిమాండ్ ఒక్కటేనని స్పష్టం చేశారు.
“ONLY REGULAR, 100 శాతం గ్రాస్ శాలరీ” తమ ప్రధాన డిమాండ్ అని తెలిపారు. ఎట్టి పరిస్థితుల్లోనూ వెనుకడుగు వేయకుండా శాంతియుత పద్ధతిలో ఉద్యమాన్ని కొనసాగించాలని పిలుపునిచ్చారు.
నెల్లూరు కేడర్ ఐక్యత, పోరాట స్ఫూర్తిని రాష్ట్రానికి చాటేలా ప్రతి కాంట్రాక్ట్ ఉద్యోగి జేఏసీ నాయకులు కలిసి. తమ కుటుంబాలు, పిల్లల భవిష్యత్తుకు భద్రత కల్పించాలంటే ఉద్యోగాల రెగ్యులరైజేషన్ సాధించాల్సిందేనని వారు పేర్కొన్నారు.
కాంట్రాక్ట్ ఉద్యోగుల ఐదు ప్రధాన డిమాండ్లు
1. తక్షణ రెగ్యులరైజేషన్:
కాంట్రాక్ట్ మెడికల్ అండ్ హెల్త్ సిబ్బందిని ఎలాంటి ఆలస్యం లేకుండా వెంటనే రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేశారు.
2. 100 శాతం గ్రాస్ శాలరీ:
ఎలాంటి కోతలు లేకుండా ఉద్యోగులకు పూర్తి 100 శాతం గ్రాస్ శాలరీ చెల్లించాలని కోరారు.
3. రూ.50 లక్షల ఎక్స్‌గ్రేషియా, కుటుంబంలో ఉద్యోగం:
ఉద్యోగంలో ఉన్న సమయంలో మరణించిన కాంట్రాక్ట్ ఉద్యోగుల కుటుంబాలకు రూ.50 లక్షల ఎక్స్‌గ్రేషియా అందించడంతో పాటు, కుటుంబ సభ్యుల్లో ఒకరికి ఉద్యోగం కల్పించాలని డిమాండ్ చేశారు.
4. మెడికల్ సెలవులు:
అన్ని కాంట్రాక్ట్ ఉద్యోగులకు ఈపీఎఫ్ ప్రయోజనాలతో పాటు మెడికల్ సెలవులు అమలు చేయాలని కోరారు.
5. బదిలీల విధానం:
కాంట్రాక్ట్ సిబ్బందికి పారదర్శకమైన, న్యాయమైన బదిలీల విధానం అమలు చేయాలని జేఏసీ డిమాండ్ చేసింది.
కాంట్రాక్ట్ ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం సానుకూలంగా పరిశీలించి, న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని జేఏసీ నాయకులు కోరుతున్నారు. ఐక్యతే తమ బలమని, డిమాండ్ల సాధన కోసం శాంతియుతంగా పోరాటాన్ని కొనసాగిస్తామని స్పష్టం చేశారు.




