Nellore: కార్పొరేషన్ డీ లిమిటేషన్ పై వైసీపీ నేతల అభ్యంతరం

Nellore: నెల్లూరులో 54 డివిజన్లను 72 డివిజన్లుగా విభజించడంపై వైసిపి నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.

V. Narasimhulu, Nellore
Published on: 25 May 2026 12:45 PM IST
Nellore
X

Nellore: కార్పొరేషన్ డీ లిమిటేషన్ పై వైసీపీ నేతల అభ్యంతరం

Nellore: నెల్లూరు నియోజకవర్గంలో ఉన్న 54 డివిజన్లని 72 డివిజన్లుగా విభజించడంపై ప్రతిపక్ష వైసిపి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది.. ఈ సందర్భంగా జిల్లా వైఎస్ఆర్ సిపి పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వైసిపి నేతలు మాట్లాడారు.

మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ..

కార్పోరేషన్ ఎన్నికల్లో ఓడిపోతామనే భయంతోనే కూటమి ప్రభుత్వం ఈ డీ లిమిటేషన్ ప్రక్రియ మొదలుపెట్టిందని, ప్రస్తుతం నెల్లూరులో అంబేద్కర్ రాజ్యాంగం కాదు నారాయణ రాజ్యాంగం నడుస్తోందన్నారు. నెల్లూరు 54 డివిజన్లను 72 డివిజన్లగా విభజించడంలో ప్రధాన పాత్ర నారాయణ, కోటంరెడ్డి పోషించారని, ఏ లెక్కన డీ లిమిటేషన్ ప్రక్రియ పూర్తి చేశారో ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

భౌగోళిక సరిహద్దులు అంశాల మీద పట్టు లేని నాయకులు డీ లిమిటేషన్ చేశారని, గెలుపే లక్ష్యంగా పెట్టుకున్నట్లు హడావిడిగా డీ లిమిటేషన్ పూర్తి చేశారని తెలిపారు. కాలనీలను కూడా విభజించిన ఘనత మన మంత్రి నారాయణకే దక్కిందని, చివరికి కుటుంబాన్ని కూడా ఓట్లు పరంగా చీల్చి, డీ లిమిటేషన్ చేసిన ఘనత ఈ ప్రభుత్వానికే చెల్లిందని అన్నారు. జగన్ మోహన్ రెడ్డిని నేరుగా ఢీ కొట్టలేకనే ఈ దుర్మార్గపు విభజనకు పాల్పడిందని అన్నారు మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి.

ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ..

పెన్నా నదికి రెండు వైపులా కలుపుతూ.. ఇష్టానుసారంగా ముక్కలు చేసి డివిజన్లు కలిపారని, అవగాహన లేకుండా, నెల్లూరు డివిజన్లను అస్తవ్యస్తంగా విభజించారని చెప్పారు. SIR ప్రక్రియ ఓ వైపు జరుగుతున్న సమయంలో.. హడావిడిగా డీ లిమిటేషన్ చేయాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. వైయస్సార్ సిపిలో గెలిచిన కార్పోరేటర్ల అందరినీ, అబద్దాలు చెప్పి లాక్కోవడం రాజ్యాంగమా అని ప్రశ్నించారు.

పేదవాడి నుంచి దోచుకున్న డబ్బు ఈ ప్రభుత్వం ఎలా వృధా చేస్తుందో చెబితే.. ప్రజలు మిమ్మల్ని తరిమేస్తారని, త్వరలోనే ఆ రోజులు కూడా వస్తాయని అన్నారు. జగన్మోహన్ రెడ్డి పేరు కూడా ఎత్తే అర్హత నారాయణకు లేదని చెప్పారు పర్వత్ రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి.

ఆనం విజయ కుమార్ రెడ్డి మాట్లాడుతూ :--

నెల్లూరు నియోజకవర్గంలో ఉన్న 54 డివిజన్లను 72 డివిజన్లగా విభజించడంలో ప్రభుత్వం ఫెయిల్ అయిందని, జనాభా ప్రాతిపదికన కాకుండా , భౌగోళిక అంశాల్ని పరిగణలోకి తీసుకోకుండా, కేవలం సర్వే నెంబర్ల ఆధారంగా డివిజన్లు చీల్చిన ఘనత ఈ నాయకులదే అని అన్నారు. కనీసం ఎవరికి కూడా ఈ విభజనపై అవగాహన లేని పరిస్థితి ఏర్పడిందని చెప్పారు.

ఏదో అధికారం చేతిలో వుందని ముక్కలు చెక్కలు చేస్తూ.. డీ లిమిటేషన్ చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చింతా రెడ్డి పాలెం, అల్లీపురం , రాజుపాలెం గ్రామాల్ని కలిపిన పరిస్థితి చూస్తే ఈ ప్రక్రియ కుట్ర అర్థమవుతుందని అన్నారు. డీ లిమిటేషన్ ను పునః పరిశీలన చేయాలని కమీషనర్ ని కోరామని, కేవలం దుర్మార్గపు ఆలోచనతోనే రాజకీయ కుట్రలో భాగంగా డివిజన్ల విభజన చేశారని విమర్శించారు. రాజకీయ కోణంలో ఇష్టానుసారంగా, గెలుపే లక్ష్యంగా చేసిన డీ లిమిటేషన్ పై పోరాటం చేస్తామని చెప్పారు.

V. Narasimhulu, Nellore

V. Narasimhulu, Nellore

Next Story