Nellore: కరువు మండలాలను వెంటనే ప్రకటించాలి: సీపీఎం డిమాండ్!
Nellore: రాష్ట్రంలో కరువు మండలాలను వెంటనే ప్రకటించి సహాయక చర్యలు చేపట్టాలి: నెల్లూరు సీపీఎం డిమాండ్. సెప్టెంబర్ 22 నుంచి జిల్లావ్యాప్తంగా ప్రత్యేక పాదయాత్రలు.
Nellore: కరువు మండలాలను వెంటనే ప్రకటించాలి: సీపీఎం డిమాండ్!
నెల్లూరు: రాష్ట్రంలో ఎల్ నినో ప్రభావం వల్ల తీవ్ర కరువు పరిస్థితులు ఏర్పడ్డాయని ప్రభుత్వమే అధికారికంగా ప్రకటించిందని అయితే స్పష్టంగా కరువు మండలాలు ప్రకటించకపోవడం కరువు సహాయక చర్యలు చేపట్టకపోవడం సరైనది కాదని సిపిఎం జిల్లా కార్యదర్శి మూలం రమేష్ విమర్శించారు. సిపిఎం నెల్లూరు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సోమవారం ఉదయం స్థానిక బాలాజీ నగర్ లోని సిపిఎం నెల్లూరు జిల్లా కమిటీ కార్యాలయంలో ప్రెస్ మీట్ నిర్వహించారు.
ఈ సందర్భంగా సిపిఎం నెల్లూరు జిల్లా కార్యదర్శి మూలం రమేష్ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎం మోహన్ రావు మాదాల వెంకటేశ్వర్లు మాట్లాడారు.. ఎల్ నినో ప్రభావం వల్ల నెల్లూరు జిల్లాలో అనేక మండలాల్లో తీవ్ర కరువు పరిస్థితులు ఏర్పడ్డాయని ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు.
వర్షపాతం స్థాయి గతంలో ఎన్నడూ లేని విధంగా తగ్గడం సోమశిల జలాశయం మరియు చెరువులలో నీటి నిల్వలు లేకపోవడం వల్ల రైతాంగం గ్రామీణ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. కరువు పరిస్థితులు ఉన్నాయని ప్రభుత్వం ప్రకటనలకే పరిమితమైనదని అన్నారు సహాయక చర్యలు చేపట్టడం రైతాంగాన్ని ఆదుకోవడం గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి పనులను పెంచడం లాంటి చర్యలు చేపట్టడం లేదని అన్నారు.
కేంద్ర ప్రభుత్వం నుండి డిమాండ్ చేసి కరువు సహాయక నిధులను రాబట్టాలని కోరారు. రైతులకు, గ్రామీణ ప్రాంత ప్రజలకు తక్షణమే కరువు సహాయం అందించాలని డిమాండ్ చేశారు. కరువు మండలాలను స్పష్టంగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఎల్ నినో ప్రభావం వల్ల ఇటువంటి దుర్భర పరిస్థితులు ఏర్పడతాయని శాస్త్రవేత్తలు చెబుతున్నప్పటికీ ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టకపోవడం విచారకరమని అన్నారు.
కేవలం రివ్యూ మీటింగ్లకు ప్రచార కార్యక్రమాలకు మాత్రమే ప్రభుత్వం పరిమితమవుతున్నదని అన్నారు. కరువు ప్రాంతాలలో ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి పర్యటించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా నాయకులు మన్నూరు భాస్కరయ్య, నగర కార్యదర్శి కత్తి శ్రీనివాసులు పాల్గొన్నారు.




