Nellore: దామవరం చెరువు పూడికతీత పనులకు శ్రీకారం
Nellore: నెల్లూరు జిల్లా దగదర్తి మండలం దామవరం గ్రామంలో రూ.5.50 లక్షల వ్యయంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న చెరువు పూడికతీత పనులకు ఆదివారం శ్రీకారం చుట్టారు.
Nellore: దామవరం చెరువు పూడికతీత పనులకు శ్రీకారం
Nellore: నెల్లూరు జిల్లా, దగదర్తి మండలం దామవరం గ్రామంలో రూ.5.50 లక్షల వ్యయంతో చేపట్టనున్న చెరువు పూడికతీత పనులను, తెలుగుదేశం పార్టీ నాయకులు ఆదివారం ప్రారంభించారు. కావలి ఎమ్మెల్యే కావ్య క్రిష్ణారెడ్డి ఆదేశాల మేరకు దామవరం చెరువు నీటి సంఘం అధ్యక్షుడు ఐత మహేశ్వరరావు ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో దగదర్తి మండల తెలుగుదేశం పార్టీ ఇన్‌చార్జి పమిడి రవికుమార్ చౌదరి ముఖ్య అతిథిగా పాల్గొని కొబ్బరికాయ కొట్టి పనులకు శ్రీకారం చుట్టారు.
ఈ కార్యక్రమంలో యూనిట్ ఇంచార్జ్ మారుబోయిన గోపాల్, కప్పిరి అశోక్, ఒట్టికాళ్ళ నవీన్, గోపసాని శ్రీనివాసులు, నీటి సంఘ వైస్ ప్రెసిడెంట్ పల్లా వెంకట రమయ్య, నారాయణపురం నీటి సంఘ అధ్యక్షులు డేగ వెంకయ్య, పొడమేకల కొండయ్య, హరిబాబు, మందా శ్రీనివాసులు, నీటి సంఘం ప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, రైతులు పాల్గొన్నారు.




