Nellore: దళిత యువకుడిని కొట్టి చంపిన డిప్యూటీ తహసిల్దార్ ఆయన కుమారుడు?

Nellore: నెల్లూరు జిల్లా కొండాపురం మండలం సత్యవోలు వద్ద ఘోరం జరిగింది. బైక్ సైడ్ ఇచ్చే విషయంలో తలెత్తిన వివాదం

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 16 May 2026 9:09 PM IST
Nellore
X

Nellore: దళిత యువకుడిని కొట్టి చంపిన డిప్యూటీ తహసిల్దార్ ఆయన కుమారుడు?

Nellore: నెల్లూరు జిల్లా కొండాపురం మండలం సత్యవోలు వద్ద గత రాత్రి జరిగిన ఓ హత్య కేసు తీవ్ర వివాదాన్ని రేపుతోంది.అదే మండలంలోని కొమ్మి గ్రామానికి చెందిన ఓ డిప్యూటీ తహసిల్దార్ అయన కుమారుడు మరికొందరు కలిసి రసూల్ అనే వ్యక్తిని కొట్టి చంపారు.గానుగపెంట గ్రామానికి చెందిన కొందరు యువకులు కొమ్మి గ్రామానికి వచ్చి తిరిగి తమ స్వగ్రామం గానుగపెంటకు బైక్ పై వెళ్ళుతుండగా మార్గం మధ్యలో డిప్యూటీ తాసిల్దార్ కారు ఎదురు రావడంతో సైడ్ తీసుకునే క్రమంలో తలెత్తిన వివాదం, జడ రసూల్ హత్యకు దారి తీసినట్లు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.

రసూల్ ను హత్య చేసిన నిందితులు అతని డెడ్ బాడీని సమీపంలోని ఓ సేద్యపు బావిలో పడేశారు.మృతుడు దళిత వర్గాలు వర్గానికి చెందిన వ్యక్తి కావడం హత్య చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న వారు అగ్రవర్ణాలకు చెందిన వారు కావడంతో ఈ ఘటన తీవ్ర వివాదానికి తెరలైపోయింది. రసూల్ హత్యపై జిల్లా కు చెందిన ఎమ్మార్పీఎస్, దళిత సంఘాలు ఆందోళనకు దిగాయి. గత రాత్రి రసూల్ ను హత్య చేసి బావిలో పడేసినప్పటికీ ఇవాళ మధ్యాహ్నం వరకు డెడ్ బాడీని బయటకు తీయకపోవడంతో దళిత సంఘాల నాయకులు పెద్ద ఎత్తున గ్రామానికి చేరుకొని పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

కొద్దిసేపటి క్రితం రసూల్ డెడ్ బాడీని బావి నుంచి బయటకు తీశారు దాంతో తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసిన కుటుంబ సభ్యులు దళిత సంఘాల నాయకులు రసూల్ మృతదేహాన్ని హత్య చేశారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న వారి నివాస వద్దకు ఊరేగింపుగా తీసుకెళ్లారు . ఈ సందర్భంగా పోలీసులపై దళిత సంఘాల నాయకులు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రసూల్ డెడ్ బాడీని కొమ్మికి తీసుకునే వెళ్లే క్రమంలో పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దాంతో కొంతసేపు రసూల్ డెడ్ బాడీని కొండాపురం ప్రధాన రహదారిపై ఉంచి, బాధితులు, దళిత సంఘాల నాయకులు ఆందోళనకు దిగారు. పోలీసుల తీరును నిరసించారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story