Sangam: సంగంలో రీ-సర్వే పనులు వేగవంతం చేయాలి డిప్యూటీ డైరెక్టర్
Sangam: నెల్లూరు జిల్లా సంగం తహసీల్దార్ కార్యాలయంలో రీ-సర్వే ప్రక్రియపై అధికారులతో సమీక్ష నిర్వహించిన సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ డిడి వై. నాగశేఖర్.
Sangam: సంగంలో రీ-సర్వే పనులు వేగవంతం చేయాలి డిప్యూటీ డైరెక్టర్
సంగం: నెల్లూరు జిల్లా సంగం తహసీల్దార్ కార్యాలయంలో సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ డిప్యూటీ డైరెక్టర్ వై. నాగశేఖర్ శుక్రవారం రీ-సర్వే ప్రక్రియపై అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మండల సర్వేయర్లతో పాటు గ్రామ సర్వేయర్లు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా డిప్యూటీ డైరెక్టర్ నాగశేఖర్ మాట్లాడుతూ.. మండలంలో చేపడుతున్న రీ-సర్వే పనులను మరింత వేగవంతం చేయాలని ఆదేశించారు. సర్వే ప్రక్రియలో ఎటువంటి లోపాలు లేకుండా, పారదర్శకంగా పనులు పూర్తి చేయాలని సూచించారు.
ముఖ్యంగా రీ-సర్వే సమయంలో ప్రజలకు, రైతులకు ఎటువంటి ఇబ్బందులు ఎదురుకాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని స్పష్టం చేశారు.
స్థానిక ప్రజల నుంచి వచ్చే దరఖాస్తులను, సమస్యలను ఎప్పటికప్పుడు పరిశీలించి త్వరితగతిన పరిష్కరించాలని అధికారులకు సూచించారు.ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఇన్స్పెక్టర్ పూర్ణ కిషోర్, మండల సర్వేయర్ రాజా, గ్రామ సర్వేయర్లు పాల్గొన్నారు.




