Nellore: వరికుంటపాడు మండలం జవాన్ అదృశ్యంపై కుటుంబ సభ్యుల ఆందోళన!
Nellore: నెల్లూరు జిల్లా వరికుంటపాడు మండలానికి చెందిన ఆర్మీ జవాన్ పగడాల రవి రైలు ప్రయాణంలో అదృశ్యమయ్యాడు.
Nellore: వరికుంటపాడు మండలం జవాన్ అదృశ్యంపై కుటుంబ సభ్యుల ఆందోళన!
Nellore: నెల్లూరు జిల్లా వరికుంటపాడు మండలం తోటలచెరువుపల్లి గ్రామానికి చెందిన 38 ఏళ్ల ఆర్మీ జవాన్ పగడాల రవి అదృశ్యం కలకలం రేపుతోంది. జూలై 19వ తేదీ మధ్యాహ్నం సుమారు 3 గంటల 40 నిమిషాలకు న్యూ జల్పైగురి నుంచి రైలులో బయలుదేరిన అనంతరం తన భార్య వరలక్ష్మితో చివరిసారిగా ఫోన్‌లో మాట్లాడినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.వాస్తవానికి విమానంలో రావాలని భావించిన రవి, విమానం మిస్ కావడంతో రైలులో ప్రయాణం ప్రారంభించినట్లు చెప్పారని, రైలులో టికెట్ ఎగ్జామినర్ (టీసీ) రావడంతో టికెట్ తీసుకుని కొద్దిసేపటి తర్వాత మళ్లీ ఫోన్ చేస్తానని చెప్పి కాల్ ముగించారని కుటుంబ సభ్యులు వెల్లడించారు.
అయితే ఆ తర్వాత నుంచి ఆయన ఫోన్ అందుబాటులోకి రాలేదని తెలిపారు.మూడు రోజుల పాటు ఫోన్ రింగ్ అయినప్పటికీ ఎలాంటి స్పందన రాలేదని, చివరిసారిగా ఒడిశా రాష్ట్రంలోని భద్రక్ ప్రాంతంలో మొబైల్ సిగ్నల్ నమోదైనట్లు సమాచారం ఉందన్నారు. అప్పటి నుంచి రవి ఆచూకీ తెలియక కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.
గత 19 రోజులుగా తమ తండ్రి కోసం ఇద్దరు చిన్నారులు కన్నీరుమున్నీరుగా ఎదురుచూస్తున్నారని, ప్రభుత్వం, ఆర్మీ ఉన్నతాధికారులు, పోలీసులు వెంటనే స్పందించి పగడాల రవి ఆచూకీ కనుగొని క్షేమంగా ఇంటికి చేర్చాలని కుటుంబ సభ్యులు విజ్ఞప్తి చేస్తున్నారు.




