Nellore: నెల్లూరు జిల్లాలో సరసమైన ధరలకు 'ధరణి' బ్రాండ్ బియ్యం అమ్మకాలు!

Nellore: నెల్లూరు జిల్లా కొడవలూరు, కోవూరు పీఏసీఎస్ కేంద్రాలలో 'ధరణి' బ్రాండ్ నాణ్యమైన బియ్యం విక్రయ కేంద్రాలను జాయింట్ కలెక్టర్ ప్రారంభించారు.

A Praveen, Nellore
Published on: 13 Nov 2026 6:50 PM IST
Nellore
X

Nellore: నెల్లూరు జిల్లాలో సరసమైన ధరలకు 'ధరణి' బ్రాండ్ బియ్యం అమ్మకాలు!

నెల్లూరు: రాష్ట్రంలో బియ్యం ధరలను నియంత్రించి, వినియోగదారులకు సరసమైన ధరలకు నాణ్యమైన బియ్యం అందుబాటులో ఉంచే లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పౌర సరఫరాల శాఖ ద్వారా "ధరణి (DHARANI) బ్రాండ్" పేరుతో BPT మరియు KNM రకాల నాణ్యమైన బియ్యాన్ని వినియోగదారులకు సరసమైన ధరలకు అందుబాటులో ఉంచుతోంది. ఈ కార్యక్రమం ద్వారా ప్రజలకు నాణ్యమైన బియ్యాన్ని తక్కువ ధరలకు అందించడంతో పాటు, మార్కెట్లో బియ్యం ధరలను నియంత్రించేందుకు చర్యలు చేపట్టడం జరుగుతోంది.

గౌరవనీయులైన సంయుక్త కలెక్టరు, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వారు కొడవలూరు మండలం కొడవలూరు గ్రామము నందు గల ప్రాధమిక సహకార పరపతి సంఘం, (PACS) నందు మరియు కోవూరు మండలం లోని కోవూరు గ్రామము లోని ప్రాధమిక సహకార పరపతి సంఘం, (PACS) నందు ధరణి బ్రాండు బియ్యం అమ్మకాల కోసం ప్రత్యేక కౌంటరు ను ప్రారంభించారు.

ఇందులో BPT రకం 26 కిలోల బస్తా ఒక్కింటికి రూ.1274/- లు మరియు KNM రకం 26 కిలోల బస్తా ఒక్కింటికి రూ.1300/- లకు నాణ్యమైన బియ్యం ను కార్డుదారులకు అందించుచున్నారు. ఆధార్ కార్డు ద్వారా ఒక కుటుంబానికి ఒక బస్తా వంతున అందజేయుట జరుగుతుంది. సదరు మండల కేంద్రాలకు సమీప గ్రామాల ప్రజలు ఈ అవకాశం సద్వినియోగం చేసుకోవలసినది గా తెలియజేయడమైనది.

ఇప్పటికి శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని నెల్లూరు నగరంలోని ఫతేఖాన్్పట, నవాబుపేట, కావలి, గూడూరు మరియు పొదలకూరు రైతు బజార్లలో మొత్తం 5 రైతు బజార్ కేంద్రాల ద్వారా కార్డుదారులకు తక్కువ ధరలకు ధరణి బ్రాండ్ నాణ్యమైన బియ్యాన్ని విక్రయించడం జరుగుతోంది. ఈ కేంద్రాల ద్వారా ఇప్పటివరకు జిల్లాలో మొత్తం 5644 మంది కార్డుదారులు 146.74 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని కొనుగోలు చేసి, ప్రభుత్వం కల్పించిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నారు.

త్వరలో జిల్లా లోని అన్నీ మండల కేంద్రాలలోని ప్రాధమిక సహకార పరపతి సంఘం, (PACS) ల యందు బియ్యం విక్రయాల స్పెషల్ కౌంటర్లు ను ప్రారంభించుట జరుగుతుంది. ప్రజలకు సరసమైన ధరలకు నాణ్యమైన బియ్యం అందుబాటులో ఉండేలా అధికారులు నిరంతరం పర్యవేక్షించుచున్నారని, ప్రభుత్వం నిర్ణయించిన ధరల అమలులో ఎలాంటి ఉల్లంఘనలు జరగకుండా చర్యలు తీసుకొనుచున్నారు.

A Praveen, Nellore

A Praveen, Nellore