Nellore: దుత్తలూరు జడ్పీటీసీగా మాజీ ఎమ్మెల్యే కంభం విజయరామిరెడ్డి గెలుపు!

Nellore: శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా దుత్తలూరు జడ్పీటీసీగా టీడీపీ అభ్యర్థి, మాజీ ఎమ్మెల్యే కంభం విజయరామిరెడ్డి 6,562 ఓట్ల భారీ మెజార్టీతో ఘన విజయం సాధించారు.

VENKATA PRASAD, UDAYAGIRI
Published on: 7 Nov 2026 10:34 PM IST
Nellore
X

Nellore: దుత్తలూరు జడ్పీటీసీగా మాజీ ఎమ్మెల్యే కంభం విజయరామిరెడ్డి గెలుపు!

నెల్లూరు: నెల్లూరు జిల్లా దుత్తలూరు జెడ్పీటీసీ స్థానంలో తెలుగుదేశం పార్టీ ఘన విజయం సాధించింది. టీడీపీ అభ్యర్థి, మాజీ ఎమ్మెల్యే కంభం విజయరామిరెడ్డి 6,562 ఓట్ల భారీ మెజార్టీతో విజయభేరి మోగించారు. ప్రత్యర్థులపై స్పష్టమైన ఆధిక్యం సాధించి జెడ్పీటీసీగా గెలుపొందారు. ఈ విజయంతో దుత్తలూరు మండలంలో టీడీపీ శ్రేణుల్లో సంబరాలు అంబరాన్నంటాయి. కంభం విజయరామిరెడ్డికి పార్టీ నాయకులు, కార్యకర్తలు అభినందనలు తెలియజేశారు.

VENKATA PRASAD, UDAYAGIRI

VENKATA PRASAD, UDAYAGIRI